1 నుంచి టోల్‌ గేట్‌ చార్జీల పెంపు! | India To Implement Toll Hike And FASTag Rule Changes From April 1st, Users Face Higher Charges And Penalties | Sakshi
Sakshi News home page

1 నుంచి టోల్‌ గేట్‌ చార్జీల పెంపు!

Mar 24 2026 8:18 AM | Updated on Mar 24 2026 9:28 AM

toll charges increase april 1 india highways fastag price hike

బెంగళూరు: ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రంలో టోల్‌ గేట్‌ చార్జీలు పెరగనుండటంతో వాహన యజమానులు, డ్రైవర్ల జేబుకు రంధ్రం పడనుంది. ప్రతి ఏడాది తరహాలో ఈసారి 3 నుంచి 5 శాతం మేర టోల్‌ రుసుము పెరగనుంది. రాష్ట్రంలోని 9 జాతీయ రహదారుల్లో టోల్‌ గేట్లలో ఇది వర్తిస్తుంది. 

మైసూరు–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వే ప్రయాణం మరింత వ్యయం కానుంది. జాతీయ హైవే అథారిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత రెండేళ్లుగా ఏటా టోల్‌ పెంచుతూ ఉన్నారు. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఐఏ ఏప్రిల్‌ 1 నుంచి వర్తించేలా ఫాస్ట్‌ట్యాగ్‌ పాస్‌ ధరను  పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో హైవేలలో సొంత వాహనాలలో ప్రయాణ ఖర్చు పెరగనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement