కష్టకాలంలో ఉన్నాం.. విరాళాలివ్వండి: ముఖ్యమంత్రి పిలుపు | Sakshi
Sakshi News home page

కష్టకాలంలో ఉన్నాం.. విరాళాలివ్వండి: ముఖ్యమంత్రి పిలుపు

Published Fri, May 14 2021 8:36 AM

Tamil Nadu CM MK Stalin Appeal Donation To CMRF - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై : కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు దాతలు ముందుకు వచ్చి చేయూత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు, సామాజిక సంస్థలు, భారీ పరిశ్రమల యాజమాన్యాలను ఉద్దేశించి సీఎం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రజల జీవనా«ధారం దెబ్బతినిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ కుంటువండిందని పేర్కొన్నారు. సహాయ చర్యల కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని వెల్లడించారు. ఆర్థికంగా పునరుత్తేజం పొందడానికి ప్రభుత్వం అనేక అవకాశాలను అన్వేషిస్తోందని తెలిపారు.

ప్రజా బాహుళ్యంలోని సంఘాలు, సంస్థలు తోచిన రీతిలో సహాయం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. విరాళాలు, ఖర్చు వివరాలను వెబ్‌సెట్‌లో పొందుపరుస్తామని తెలిపారు. దాతల విరాళాలపై 80 (జీ) కింద వంద శాతం పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఐల నుంచి పొందే విరాళాలపై కూడా పన్ను మినహాయింపు పొందవచ్చని వివరించారు. ఆన్‌లైన్, బ్యాంకు అకౌంట్‌ ద్వారా విరాళమిచ్చి రసీదు పొందవచ్చని తెలిపారు. దాత లు తమ విరాళాలను నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి మాత్రమే సమరి్పంచాలని పేర్కొన్నారు. రూ.10 లక్షలకు పైగా విరాళం ఇచ్చే దాతలు, సంస్థల పేర్లను వార్తాపత్రికల్లో ప్రచురిస్తామని వెల్లడించారు. ఇచ్చే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కరోనా నివారణ చర్యల కోసం మాత్రమే వినియోగిస్తామని హామీ ఇస్తున్నట్టు తెలిపారు.

చదవండి: అన్నాడీఎంకేకు మరో షాక్‌: చేజారనున్న ‘పెద్దరికం’
చదవండి: కలుపుగోలు సీఎం: స్టాలిన్‌ కొత్త సంప్రదాయం

Advertisement
 
Advertisement
 
Advertisement