ఒక సెషన్‌కు మించి సస్పెన్షన్‌

Supreme Court sets aside House action against 12 BJP MLAs - Sakshi

రాజ్యాంగ విరుద్ధమే

మహారాష్ట్ర ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలను ఒక సెషన్‌ మించి సస్పెండ్‌ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతేడాది వర్షాకాల సమావేశాల్లో సభాపతి పట్ల అమర్యాదగా ప్రవర్తించడంతోపాటు దూషణ చేశారంటూ ఆ స్థానంలో కూర్చొన భాస్కర్‌ జాదవ్‌ 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ ఎమ్మెల్యే ఆశిష్‌ షేలర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ విచారించిన జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. అసెంబ్లీ నిర్ణయం చట్టం దృష్టిలో దురుద్దేశంతో కూడుకున్నదన్న ధర్మాసనం... బీజేపీ ఎమ్మెల్యేలను చట్టసభ ప్రయోజనాలకు అర్హులుగా ప్రకటించింది. శాసనసభ సభ్యులపై ఏడాదిపాటు సస్పెన్షన్‌ విధించడం ఆర్టికల్‌ 14 ఉల్లంఘించినట్లేనని ఎమ్మెల్యేల తరఫు సీనియర్‌ న్యాయవాదులు మహేశ్‌ జెఠ్మలానీ, ముకుల్‌ రోహత్గి, హరీశ్‌ సాల్వే, నీరజ్‌ కిషన్‌ కౌల్‌లు ఆరోపించారు.

ఘటన పట్ల సభాపతికి క్షమాపణ తెలిపామని, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారడం సరికాదని తెలిపారు. తాము సీసీటీవీ ఫుటేజీ కోరినప్పటికీ డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించారని తెలిపారు. సదరు సస్పెన్షన్‌ ఆరు నెలల మించి పనిచేయదు కాబట్టి సభాపతి స్థానంలోని భాస్కర్‌ జాదవ్‌ తీసుకొన్న నిర్ణయం ప్రాథమికంగా రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి గైర్హాజరు కావడానికి గరిష్టపరిమితి 60 రోజులేనని ఆ తర్వాత ఆ స్థానం ఖాళీగా ప్రకటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గతేడాది వర్షాకాల సమావేశాల్లో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సస్పెండ్‌ చేస్తూ తీసుకొన్న అసెంబ్లీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. జనవరి 19న తీర్పు రిజర్వు చేసిన ధర్మాసనం శుక్రవారం వెలువరించింది.   

పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ప్రమాణాలు నిర్దేశించలేం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి తామెలాంటి ప్రమాణాలు నిర్దేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2006లో నాగరాజు వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో విధంగా ఎస్సీఎస్టీల ప్రాతినిధ్యానికి సంబంధించి పరిమాణాత్మక డాటాను సేకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొంది.

ఎస్సీ ఎస్టీ వర్గాలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ, సర్వీసులో తగిన ప్రాతినిధ్యం నిర్ణయించడానికి ఎలాంటి కొలమాలన్ని నిర్ణయించలేమని జర్నైల్‌ సింగ్‌ తదితరులు వర్సెస్‌ లచ్మి నారాయణ గుప్తా తదితరులు కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయిలతో కూడిన ధర్మాసనం మెరిట్స్‌పై ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించబోవడం లేదని శుక్రవారం తీర్పు వెలువరిస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరి 24కు వాయిదా వేసింది.

‘‘ఎస్సీఎస్టీ వర్గాలకు చెందిన వారి ప్రాతినిధ్యం తగినంతగా లేకపోవడం గుర్తించడానికి ఎలాంటి కొలమానం వేయలేం. వారి ప్రాతినిధ్యానికి సంబంధించిన గణాంకాలు సేకరించే బాధ్యత రాష్ట్రాలదే. ఈ అంశాన్ని మేం రాష్ట్రాలకే వదిలేస్తున్నాం. పూర్తి సర్వీసు కాకుండా క్యాడర్‌ను యూనిట్‌గా తీసుకొని గణాంకాలు సేకరించాలి. ఎం.నాగరాజు తీర్పుపై ఎలాంటి ప్రభావం చూపకూడదు. దామాషా ప్రకారం వారి ప్రాతినిధ్యం ఉందా లేదా అనే మెరిట్స్‌ జోలికి వెళ్లడం లేదు. దీన్ని రాష్ట్రాలకే వదిలేస్తున్నాం ’’ అని తీర్పులో వివరించింది. 

‘రాజ్యాంగం ప్రకారం ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి గైర్హాజరయ్యేందుకు అనుమతించే గరిష్ట కాలపరిమితి 60 రోజులే. ఈ కాలావధి దాటితే సదరు నియోజకవర్గం ఖాళీ అయినట్లుగానే పరిగణించాలి. కాబట్టి ఏడాదిపాటు సస్పెండ్‌ చేయడం కుదరదు. అది రాజ్యాంగ విరుద్ధం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top