న్యూ ఇయర్‌ స్పెషల్‌.. ఉద్యోగులకు ‘కొత్త’ కానుక

Stalin Govt Hikes 31 Percent Da To Employees As Pongal Gift - Sakshi

సాక్షి, చెన్నై: ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక ప్రకటించింది. డీఏను 14 శాతం మేరకు పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత ప్రభుత్వ హయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు జాక్టో జియో వేదికగా సాగించిన ఉద్యమాలు, సమ్మెల గురించి తెలిసిందే. డీఎంకే సర్కారు అధికా రంలోకి వచ్చిన అనంతరం తమ సమస్యలపై దృష్టి పెట్టాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞపి చేశాయి.

ఇందుకు తగ్గట్టుగా అసెంబ్లీలో ఉద్యోగులకు అనుకూలంగా సీఎం స్టాలిన్‌ ప్రకటన చేశారు. ఈ మేరకు మంగళవారం కొత్త సంవత్సరం కానుకగా డీఏను 14 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు 17 శాతంగా ఉన్న డీఏను 31 శాతంగా పెంచారు. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ పెంపును వర్తింప చేశారు. ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8,724 కోట్ల అదనపు భారం పడిందన్నారు. అలాగే సీ, డీ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా రూ. 3,000 ప్రకటించారు. పెన్షనర్లకు రూ. 500 ఇవ్వనున్నారు. ఇక, ప్రత్యేక కేటగిరిలో పనిచేస్తున్న గ్రామ అధికారులకు రూ. 1000 రూ, పదవీ విరమణ పొందిన వారికి రూ. 300 ఇవ్వనున్నారు. ఈ కానుకతో రూ. 169 కోట్ల వరకు భారం పడినట్లు అధికారులు వెల్లడించారు.  

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top