సుక్మా: ఒకవైపు భారీఆ మావోయిస్టు లొంగిపోతున్న వేళ.. మావోయిస్టుల కుట్రను సైతం భగ్నం చేశాయి భద్రతా బలగాలు. చత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో 40 కేజీల ఐఈడీ మందుపాతరను అమర్చారు మావోయిస్టులు. అయితే దీన్ని పసిగట్టిన భద్రతా బలగాలు.. మావోయిస్టుల కుట్రను భగ్నం చేశాయి. మందుపాతర పెట్టిన స్థలాన్ని గుర్తించిన బలగాలు.. దాన్ని నిర్వీర్యం చేశాయి.
ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 28వ తేదీ) ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నేతలు డీజీపీ ఎదుట లొంగిపోయారు. పుల్లూరు ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాష్‌లు లొంగిపోయారు. జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ ఇచ్చిన పిలుపుమేరకు వారు లొంగిపోయినట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు.


