Satyendar Jain Health Update: ఆక్సిజన్‌ సపోర్టుపై ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌

Satyendar Jain On Oxygen Support At LNJP Hospital - Sakshi

ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సత్యేంద్రజౌన్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ప్రస్తుతం ఆయనకు లోక్‌ నాయక్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సపోర్టుతో వైద్యం అందిస్తున్నారు. కాగా తీహార్‌ జైల్లో శిక్షననుభవిస్తున్న సత్యేంద్ర జైన్‌ కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురవుతున్నారు. గత సోమవారమే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జైన్‌.. తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యారు.

బుధవారం ఉదయం జైలులోని బాత్రూమ్‌లో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో ఆయన్ను సిబ్బంది వెంటనే దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆక్సిజన్‌ సపోర్టుపై ఉన్నారు.  

కాగా జైన్‌ అసుపత్రి పాలవ్వడం గడిచిన వారం రోజుల్లో ఇది రెండోసారి. మే 22న  వెన్నెముక సమస్యతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంత‌రం తిరిగి జైలుకు తీసుకువ‌చ్చారు.

తీహార్ జైలు డీజీ తెలిపిన వివరాల ప్రకారం.. జైలు ఆవరణలోని సెల్ నంబర్ 7లో ఉన్న సత్యేందర్ జైలు గురువారం ఉదయం దాదాపు 6 గంటలకు వాష్‌రూమ్‌లో పడిపోయాడని పేర్కొన్నారు.అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించామని, అక్కడ అతనికి పలు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. సత్యేందర్ జైన్‌కు వెన్నెముకకు శస్త్ర చికిత్స జరగాల్సి ఉందని డీజీ తెలిపారు.

ఇదిలా ఉండగా మ‌నీ లాండ‌రింగ్ కేసులో అరెస్ట్‌ అయిన జైన్‌.. తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అ‍ప్పటి నుంచి ఆయన 35కిలోల బరువు తగ్గిన్నట్లు ఆప్‌ వర్గాలు ఆరోపిన్నాయి.
చదవండి: కారు దొంగతనం.. డ్రైవింగ్ రాక 10 కి.మీ తోసుకెళ్లి... చివరికి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top