50% నిధులు జమచేస్తేనే ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రారంభం: గడ్కరీ

Regional Ring Road To Start Only After 50 Percentage Funding Gadkari - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు ఉత్తరభాగం అలైన్‌మెంట్, భూసేకరణ ప్లాన్‌ ఆమోదం పూర్తయిందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. 3 డీ నోటిఫికేషన్‌ను చేపట్టేందుకు వీలుగా భూసేకరణ ఖర్చులో 50% వాటాను డిపాజిట్‌ చేసేందుకు అవసరమైన ప్రతిపాదన, సరైన యంత్రాంగాన్ని రూపొందించాలన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్న 50% వాటాను జమ చేయడంపై ప్రతిస్పందనను బట్టి ప్రాజెక్ట్‌ చేపట్టే సమయం ఆధారపడి ఉంటుందని లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  

జాతీయ రహదారులకు రూ.5,534 కోట్లు  
గత ఐదేళ్లలో తెలంగాణలోని జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5,534 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.9,215 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.  లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top