నటుడు రవికిషన్‌ ఇంట తీవ్ర విషాదం | Ravi Kishan Elder Brother Ramesh Dies Of Cancer | Sakshi
Sakshi News home page

రేసుగుర్రం ఫేమ్‌ రవికిషన్‌ ఇంట తీవ్ర విషాదం

Published Thu, Mar 31 2022 12:52 PM | Last Updated on Thu, Mar 31 2022 12:53 PM

Ravi Kishan Elder Brother Ramesh Dies Of Cancer - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు (రేస్‌గుర్రం ఫేమ్‌ విలన్)‌, బీజేపీ ఎంపీ రవికిషన్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రమేశ్‌ శుక్లా ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే, కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేశ్‌.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్టు రవికిషన్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

తన అన్న ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారని అయినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే సోదురుడు కూడా మరణించడం తమ కుటుంబానికి తీరని లోటని, ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన అన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయనకు ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. కాగా, రవికిషన్​ యూపీలోని గోరఖ్​పుర్​ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. రమేశ్‌ పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement