రస్క్‌ తయారీ వీడియోపై నటి రవీనా ఆగ్రహం

Raveena Tandon React On Viral Video Of Bakery Workers Put Dirty Feet On Toast, Lick Them - Sakshi

రస్క్‌లు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. ఉదయం సాయంత్రం, ఛాయ్‌లో ముంచుకొని వీటిని తింటుంటారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత రస్క్‌లు తినే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే రస్క్‌ల తయారీకి చెందిన ఓ షాకింగ్‌ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంతోంది. అసలేం జరిగిందంటే.. ఓ ఫ్యాక్టరీలో కొందరు రస్క్‌లు తయారు చేస్తూ వాటిని ప్యాక్‌ చేస్తున్నారు. అయితే వారిలో ఒక వర్కర్‌ ట్రేలోని రస్క్‌లపై తన పాదాలను ఉంచాడు. అంతేగాక చేతులోకి కొన్ని రస్క్‌లను తీసుకొని నాలుకతో నాకుతూ ప్యాకింగ్‌ చేశాడు. ఇదంతా చూస్తూ పక్కన ఉన్న వారు సంతోషంతో నవ్వుతున్నారు.
చదవండి: వీడియో: కన్న కూతురిని చితకబాదుతూ తండ్రి పైశాచిక ఆనందం

ఈ వీడియోను శివకుమార్ పార్థసారథి అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. వర్కర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లని పట్టుకుని తన్నాలని కొందరు.. జైల్లో పెట్టాలని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు .నెటిజన్లతో పాటు బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌ సీరియస్‌ అయ్యారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ.."వారు పట్టుబడతారని, ఎప్పటికీ కటకటల వెనుకే మగ్గుతారని ఆశిస్తున్నా అంటూ పేర్కొన్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top