అయోధ్య పూజారికి కరోనా

Ram mandir Priest and 16 policemen positive for coronavirus - Sakshi

16 మంది ఆలయ భద్రతా సిబ్బందికి కూడా..

ఆందోళనలో అధికార వర్గాలు

అయోధ్య: ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరగనున్న రామమందిర భూమిపూజకు భారీ ఏర్పాట్లు జరుగుతుండగా, పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన పూజారికి, పదహారు మంది భద్రతా సిబ్బందికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. కరోనా సోకిన పూజారి ప్రదీప్‌ దాస్, ఆలయంలో పూజలు నిర్వహించే నలుగురు ప్రధాన పూజారుల్లో ఒకరైన ఆచార్య సత్యేంద్ర దాస్‌ శిష్యుడు. ప్రదీప్‌ దాస్‌ని ప్రస్తుతం హోంక్వారంటైన్‌లో ఉంచారు.   అయోధ్యలో ప్రధాని మోదీ రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  రెండు వాటర్‌ ప్రూఫ్‌ మండపాలూ, దానిలో ఒక చిన్న వేదికను ఏర్పాటు చేస్తున్నారు.

న్యూయార్క్‌లో భారీ స్క్రీన్‌లపై..  
భూమిపూజ ఘట్టాన్ని అమెరికాలోని ప్రవాస భారతీయులు సైతం వీక్షించనున్నారు.  న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌ దగ్గర శ్రీరాముడి చిత్రాలూ, అయోధ్య  రామమందిరం త్రీడీ చిత్రాలను  ప్రపంచంలోనే అతిపెద్ద  17వేల చదరపుటడుగుల భారీ నాస్‌డాక్‌ స్క్రీన్‌పై దీన్ని ప్రదర్శించనున్నట్టు అమెరికన్‌ ఇండియా పబ్లిక్‌ అఫెయిర్స్‌ కమిటీ అధ్యక్షుడు జగదీష్‌ షెహానీ వెల్లడించారు. ఇది జీవిత కాలంలో చూడలేని ఒక అద్భుతమైన కార్యక్రమం అని, ఈ చారిత్రక సందర్భంలో అమెరికాలోని భారతీయులంతా అక్కడ సమావేశమౌతారని షెహానీ అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top