ఆయుధ పూజ చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ | Rajnath Singh celebrated Vijyadashami with Indian Army at Arunanchal Pradesh | Sakshi
Sakshi News home page

ఆయుధ పూజ చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Oct 24 2023 1:42 PM | Updated on Oct 24 2023 2:38 PM

Rajnath Singh at Arunanchal Pradesh Celebreated Vijyadashmi with Indian Army - Sakshi

అరుణాచల్ ప్రదేశ్‌: విజయదశమి పర్వదినం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇక్కడికి నాలుగు సంవత్సరాల క్రితం వచ్చానని, అప్పుడు జవానులతో కలిసి విజయదశమి జరుపుకోవాలని అనుకున్నానని, దేశ భద్రతకు బాధ్యత వహిస్తున్న సైనికులను చూసి గర్వపడుతున్నానని అన్నారు. 

తవాంగ్ చేరుకునే మందు రక్షణ మంత్రి అస్సాంలోని తేజ్‌పూర్ సందర్శించారు. అక్కడి నాలుగు కార్ప్స్ హెడ్‌క్వార్టర్స్‌సైనికులతో సంభాషించారు. ఇక్కడ అన్ని స్థాయిల సైనికులు ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి భోజనం చేయడాన్ని రాజ్‌నాథ్‌ ప్రశంసించారు. వివిధ రాష్ట్రాలు, మతాలు, నేపథ్యాల నుండి వచ్చిన సైనికులు ఒకే బ్యారక్స్, యూనిట్లలో కలిసి పని చేయడం భారత సైన్యానికున్న ఐక్యతను తెలియజేస్తుందన్నారు. 
ఇది కూడా చదవండి: రావణుని వైభోగం ఎంత? అవశేషాలు ఎక్కడున్నాయి?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement