Rajasthan: కూలిన మిగ్ 29 యుద్ధ విమానం.. పైలట్లకు తప్పిన ప్రమాదం | Rajasthan Iaf Fighter Plane crashes | Sakshi
Sakshi News home page

Rajasthan: కూలిన మిగ్ 29 యుద్ధ విమానం.. పైలట్లకు తప్పిన ప్రమాదం

Sep 3 2024 7:33 AM | Updated on Sep 3 2024 10:12 AM

Rajasthan Iaf Fighter Plane crashes

బార్మర్‌: రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఓ యుద్ధ విమానం కూలిపోయింది. ఓలానియోక్‌లోని ధాని సమీపంలో యుద్ధ విమానం మిగ్ 29కు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నాగనా పోలీస్‌స్టేషన్‌ పోలీసులు సంఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం నుంచి పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.

మిగ్ 29 యుద్ధ విమానం భారతదేశంలోని ముఖ్యమైన విమానాలలో ఒకటి. ఈ జెట్ విమానం బార్మర్‌లో రాత్రిపూట సాధారణ శిక్షణ మిషన్‌లో సాంకేతిక లోపానికి గురైందని వైమానిక దళం తెలిపింది. ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. మిగ్ 29 విమానంలో మంటలు చెలరేగిన వీడియోను డిఫెన్స్ కోర్ అనే ఖాతా నుంచి షేర్ చేశారు.
 

మిగ్‌ 29 విమానం 1987 నుండి అంటే దాదాపు 36 సంవత్సరాలుగా భారత వైమానిక దళం సేవలో ఉంది. సోవియట్ యూనియన్ నుంచి భారత్ ఈ విమానాన్ని కొనుగోలు చేసింది. ఈ విమానాన్ని పలుమార్లు  నవీకరించారు. విమానంలోని ప్రాథమిక నిర్మాణం మినహా దాదాపు ప్రతిదీ మార్చారు. ఇందులో కొత్త కాక్‌పిట్, నూతన రాడార్, కొత్త ఇంధన ట్యాంక్ ఉన్నాయి. కొత్త ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ కూడా అమర్చారు. కొత్త క్షిపణులను అమర్చడం ద్వారా దీనికి పూర్తిగా ఆధునిక రూపాన్నిచ్చారు.

మిగ్ 29 వేగంగా దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఆరు నిమిషాల్లో లక్ష్యన్ని ఛేదించగలదు. కార్గిల్ యుద్ధ సమయంలో ఈ విమానం కీలక పాత్ర పోషించింది. బాలాకోట్ ఘటన సమయంలో కూడా తీవ్రవాద శిబిరంపై వైమానిక దాడిలో మిగ్ 29 పాల్గొంది. ఈ విమానంలో రెండు ఇంజన్లు ఉంటాయి. పరిమాణంలో చిన్నదిగా ఉన్నా చాలా చురుకైనది. ఇది నాల్గవ తరం యుద్ధ విమానం. గంటకు దాదాపు 2,500 కిలోమీటర్ల వేగంతో ఎగిరే సామర్థ్యం దీని సొంతం.

Advertisement
 
Advertisement
Advertisement