10 ప్లేట్ల చికెన్‌ బిర్యానీ.. ఉచితంగా అందించాలి | puducherry biryani restaurant incident | Sakshi
Sakshi News home page

10 ప్లేట్ల చికెన్‌ బిర్యానీ.. ఉచితంగా అందించాలి

May 11 2026 7:50 AM | Updated on May 11 2026 9:45 AM

puducherry biryani restaurant incident

చెన్నై: పుదుచ్చేరిలోని లాస్‌పేట్, శంకర దాస్‌ స్వామిగళ్‌ ఠాకర్‌లో నివసించే సుందరకుమా ర మణికందన్, తన స్నేహితునితో కలిసి ముత్తియల్‌పేట్‌లోని మహాత్మా గాంధీ రోడ్డులో ఉన్న ’బిర్యానీ – కో’ అనే రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్లాడు. అక్కడ అతను బిర్యానీ, ఒక సైడ్‌ డిష్‌ ఆర్డర్‌ చేసి, డబ్బు చెల్లించాడు. అయితే, తాను ఆర్డర్‌ చేసిన ఆహారంలో చనిపోయిన ఒక కీటకాన్ని (ఈగను) చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు.దీని తరువాత, అతను ఈ విషయం గురించి రెస్టారెంట్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. యాజమాన్యం సరిగ్గా స్పందించలేదు.

 ఫలితంగా, అతను పుదుచ్చే రి జిల్లా వినియోగదారుల కమిషన్‌లో కేసు దాఖలు చేశాడు. కమిషన్‌ ఆ కంపెనీకి ఒక నోటీసు పంపింది. అది అందుకున్నప్పటికీ, వారు కమిషన్‌ ముందు హాజరు కాలేదు , ఎటువంటి వివరణ ఇవ్వ లేదు. పుదుచ్చేరి జిల్లా వినియోగదారుల వ్యవహారాల అధ్యక్షుడు ముత్తు వేల్‌ , సభ్యులు సువిత, అరుముగంతో కూడిన ధర్మాసనం ఈ కేసును తిరిగి విచారించింది. పత్రాలను సమీక్షించగా, బిర్యానీ – కో అందించిన ఆహారంలో పురుగులు ఉన్నట్లు నిర్ధారించబడింది. అంతేకాకుండా, పరిశుభ్రమైన, సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించనందుకు బిర్యానీ అండ్‌ కో సంస్థపై చర్య తీసుకోవాల ని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. 

ఆహారంలోని లోపం, నాణ్యత తక్కువగా ఉన్నందున, ఫిర్యాదుదారు సుందర కుమార మణికందన్‌ నష్టపరిహారంగా రూ. 10,000 , న్యాయ ఖర్చుల నిమిత్తం అదనంగా రూ. 3,000 చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది.అంతేకాకుండా, భవిష్యత్తులో బిర్యానీ అండ్‌ కో లో ఎలాంటి సేవ, ఆహార నాణ్యత సమస్యలు తలెత్తకుండా నివారించడానికి, ఫిర్యాదుదారుడు మర్యాదపూర్వకంగా 5 వారాల పాటు ప్రతి ఆదివారం 2 ప్లేట్ల చికెన్‌ బిర్యానీని (మొత్తం 10 ప్లేట్ల బిర్యానీ) ఉచితంగా అందించాలని ఆదేశించింది. ఈ తీర్పు ఇప్పుడు పుదుచ్చేరిలో చర్చనీయాంశంగా మారింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement