PM Narendra Modi Takes First Shot Of Covid Vaccination | Covid Vaccination Drive In India - Sakshi
Sakshi News home page

కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రధాని మోదీ

Mar 1 2021 7:48 AM | Updated on Mar 1 2021 11:24 AM

PM Narendra Modi Take Covid Vaccine - Sakshi

కరోనాపై ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకుని దేశాన్ని కరోనా రహితంగా చేయాలని పిలుపునిచ్చారు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కొవిడ్‌ టీకా తొలి డోసు తీసుకున్నారు. కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. కరోనాపై పోరాడుతున్న ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకుని దేశాన్ని కరోనా రహితంగా చేయాలని పిలుపునిచ్చారు.

‘‘ఎయిమ్స్‌లో కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నాను. ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి మన వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషి చెప్పుకోదగినది. టీకా తీసుకోవడానికి అర్హత ఉన్నవారందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మనమంతా కలిసి కరోనా రహిత దేశాన్ని నిర్మిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
చదవండి:
మోదీపై ఆజాద్‌ ప్రశంసలు
గాంధీ కుటుంబానికి ‘కట్‌ మనీ’

 

Advertisement
 
Advertisement
Advertisement