బ్రిటన్‌ రాజుకు ప్రధాని మోదీ ఫోన్‌

PM Narendra Modi Spoke To Britain King Charles III Over The Phone - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంగళవారం బ్రిటన్‌ రాజు చార్లెస్‌–3తో ఫోన్‌లో మాట్లాడారు. వాతావరణ మార్పులు, జీవవైవిధ్య పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో వినూత్న ఆవిష్కరణలు వంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)తెలిపింది.

27న ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చా’ 
ఈ నెల 27వ తేదీన వార్షిక ‘పరీక్షా పే చర్చా కార్యక్రమం జరగనుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మోదీ మాట్లాడనున్నారు. ఢిల్లీలోని తల్కటోరా ఇండోర్‌ స్టేడియంలో 6వ విడత పరీక్షా పే చర్చా జరగనుందని కేంద్ర విద్యాశాఖ మంగళవారం ట్వీట్‌ చేసింది.

ఇదీ చదవండి: నెతన్యాహుకు ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top