మీ బాధ్యత మరింత పెరిగింది: ప్రధాని

PM Narendra Modi Speech On Ayurveda Day - Sakshi

ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది: నరేంద్ర మోదీ

సాక్షి, న్యూఢిల్లీ : ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జామ్‌ నగర్‌లోని ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐటీఆర్‌ఏ), జైపూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఎన్‌ఐఏ)లను శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఆయుర్వేదం వైద్యప్రపంచంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అల్లోపతి, ఆయుర్వేద పద్ధతులు మన ప్రాచీన భారతదేశం యొక్క 21వ శతాబ్దపు శాస్త్రంతో కలిసిపోతాయి. ఇప్పుడు మీరందరూ దేశం యొక్క అగ్రశ్రేణి ఆయుర్వేద కేంద్రంలో భాగం కావడంతో మీ బాధ్యత మరింత పెరిగింది. మీరు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సిలబస్‌తో ముందుకు రావాలి' అని పీఎం మోదీ ఆయుర్వేద సంస్థలను ప్రారంభించిన సందర్బంగా పేర్కొన్నారు.  (సిద్ధాంతం కన్నా దేశం మిన్న)

రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, ఆయర్వేద ఉత్పత్తులకు భారతదేశం నుంచి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ పెరిగిందని ప్రధాని చెప్పారు. మనదేశంలో జనాభా ఎక్కువగా ఉ‍న్నప్పటికీ కరోనా పరిస్థితి అదుపులో ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటిలో పసుపు పాలు, అశ్వగంధ హెర్బ్‌, కాధా వంటి రోగనిరోధక శక్తి బూస్టర్లు వినియోగిస్తున్నారు. మహమ్మారి సమయంలో ఈ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది' అని ఆయన చెప్పారు. కార్యక్రమంలో రాజస్థాన​ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లూట్‌, గుజరాత్‌ సీఎ విజయ్‌ రూపానీ పాల్గొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top