మహారాష్ట్రకు 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు: మోదీ | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రకు 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు: మోదీ

Published Fri, Nov 4 2022 6:18 AM

PM Narendra Modi Rs 2 lakh crore projects approved for Maharashtra - Sakshi

ముంబై: మహారాష్ట్రలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల వల్ల కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

సుమారు 75 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసేందుకు గురువారం ముంబైలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ఈ మేరకు ఒక వీడియో సందేశం పంపించారు. మహారాష్ట్రకు రావాల్సిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఎన్నికలు జరిగే గుజరాత్‌కు తరలిపోతున్నాయంటూ ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు తీవ్రమైన సమయంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. 

Advertisement
Advertisement