‘ఎమర్జెన్సీ రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌’.. గతం గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ | PM Narendra Modi Recalls Days as RSS Pracharak | Sakshi
Sakshi News home page

‘ఎమర్జెన్సీ రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌’.. గతం గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ

Jun 25 2025 10:34 AM | Updated on Jun 25 2025 10:56 AM

PM Narendra Modi Recalls Days as RSS Pracharak

న్యూఢిల్లీ: నాడు దేశంలో అత్యవసర పరిస్థితులు విధించిన రోజుల్లో తాను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉన్నానని.. నాటి రోజులను ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. నాటి నిరసనల్లో కీలకంగా వ్యవహరించిన దేవెగౌడను ప్రధాని ప్రశంసించారు. దేశరాజధాని ఢిల్లీలో బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ను విడుదల చేసింది. దీనిలో నాటి అత్యవసర పరిస్థితిలో నరేంద్ర మోదీ ప్రారంభ రాజకీయ ప్రతిఘటనలను వివరించారు.

నాటి కాలాన్ని అభ్యాస అనుభవంగా అభివర్ణించిన ప్రధాని, నాటి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడను అత్యవసర పరిస్థితుల వ్యతిరేక ఉద్యమంలో  కీలక నేతగా పేర్కొన్నారు. మోదీ తొలి రాజకీయ ప్రయాణాన్ని హైలైట్ చేసిన ఈ పుస్తకంలో.. నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితులను మోదీ ఏ విధంగా వ్యతిరేకించారో తెలియజేశారు. ఆ సమయంలో మోదీతో కలిసి పనిచేసిన వారి ప్రత్యక్ష అనుభవాలను సేకరించి, ఈ పుస్తకంలో పొందుపరిచారు.
 

ఈ పుస్తకం విడుదల సందర్భంగా ప్రధాని మోదీ ఒక ట్వీట్‌లో ‘అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, నేను ఆర్‌ఎస్‌ఎస్‌ యువ ప్రచారక్‌ను. అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమం నాకు కొత్త పాఠాలను నేర్పింది. రాజకీయ వర్గాల నుంచి, ప్రజల నుంచి నేను చాలా నేర్చుకోగలిగాను. బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్.. నాటి తన అనుభవాలలో కొన్నింటిని పుస్తకం రూపంలో సంకలనం చేసినందుకు  ఆనందంగా ఉంది. దీనికి ముందుమాటను.. అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమంలో  కీలకంగా వ్యవహరించిన  హెచ్‌డీ దేవెగౌడ రాశారు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: అన్నగా భావించిన యువతికి ‘ప్రపోజల్‌’.. అభ్యంతరం చెప్పడంతో..

Advertisement
 
Advertisement
Advertisement