పార్లమెంట్‌.. విపక్షాలది ఫ్రస్ట్రేషన్: మోదీ | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..సస్పెన్షన్ల పర్వం

Published Tue, Dec 19 2023 8:48 AM

Parliament Session Minute To Minute Updates - Sakshi

Parliament Winter Session 2023 Updates

లోక్‌సభలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్.. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. టెలికమ్యునికేషన్‌ బిల్లు-2023 పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర వస్తు సేవల పన్ను (రెండవ సవరణ) బిల్లు- 2023 లోక్‌సభలో ఆమోదం పొందింది.

ప్రొవిజినల్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్-2023ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 

రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్‌పై మిమిక్రీ చేయడం సభ హక్కులను దిక్కరించడమేనని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. 

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత విపక్షాలు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నాయని ప్రధాని మోదీ చురకలు అంటించారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.

పార్లమెంటు వెలుపల తనపై మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ మండిపడ్డారు. ఎంపీ స్థానంలో ఉండి సభాధ్యక్షున్ని హేళన చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. 

ఎన్సీఆర్‌ ఢిల్లీ సవరణ బిల్లు, సీజీఎస్టీ సవరణ బిల్లులకు లోక్‌సభ ఆమోదం

పార్లమెంట్‌ నుంచి మరింత మంది ఎంపీల సస్పెన్షన్‌ 

 • లోక్‌సభ, రాజ్యసభల నుంచి మరింత మంది ఎంపీల సస్పెన్షన్‌
 • ఇవాళ ఒక్కరోజే లోక్‌సభ నుంచి 49 మంది ఎంపీల సస్పెన్షన్‌
 • నిన్న 33 మంది ఎంపీలు..అంతకుముందు 13 మంది సస్పెన్షన్‌ 
 • లోక్‌సభ నుంచి 95 మంది, రాజ్యసభ నుంచి 46 మంది ఎంపీల సస్పెండ్‌
 • ఈ సెషన్‌లో మొత్తం 141 మంది ఎంపీలు బయటికి

అపోజిషన్‌ ముక్త్‌ పార్లమెంట్‌కు బీజేపీ ప్రయత్నం : శశి థరూర్‌ 

 • ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తోంది 
 • ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసి చర్చ లేకుండా బిల్లులు పాస్‌ చేసుకోవాలనుకుంటోంది
 • పార్లమెంట్‌ డెమొక్రసీకి ఇవాళ చచ్చిపోయింది 

లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా 

 • విపక్షాల నినాదాల మధ్య లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా 
 • ప్లకార్డులు ప్రదర్శించవద్దని కోరిన స్పీకర్‌ 
 • పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై హోం మంత్రి స్టేట్‌మెంట్‌కు విపక్షాల పట్టు

గాంధీ విగ్రహం వద్ద ఖర్గే, శరద్‌పవార్‌ నిరసన

 • 92 మంది ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాల ఆందోళన 
 • పార్లమెంట్‌ గాంధీ విగ్రహం వద్ద నేతల నిరసన 

పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు 

 • నేడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో విపక్ష నేతల భేటీ
 • పార్లమెంట్‌ సమావేశాల బహిష్కరించాలని నిర్ణయించిన పార్టీలు 
 •  ఒక్కరోజే ఉభయ సభలో 78 మంది ఎంపీల సస్పెన్షన్ పై విపక్షాల ఆగ్రహం 
 • మొత్తం 92 మంది ఎంపీలపై పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు
 • సస్పెండైన ఎంపీలు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయాలని నిర్ణయం
 • కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ భద్రతా వైఫల్యానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు

నేడు పార్లమెంటులో కీలక బిల్లులు

 • ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్‌ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు
 • నిన్న విపక్ష ఎంపీల సస్పెన్షన్ తో  సాఫీగా సభా కార్యక్రమాలు జరిగే చాన్స్‌  
 • సస్పెన్షన్‌పై  పార్లమెంట్ బయట ఆందోళన చేపట్టనున్న విపక్ష ఎంపీలు 
 • లోక్ సభలో బిల్లులపై చర్చ ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
 • బ్రిటిష్ కాలం నాటి చట్టాల పేరు మార్పు 
 • ఐపీసీని భారత న్యాయ సంహితగా పేరు మార్పు 
 • సిఆర్పీసీకి భారత నాగరిక సురక్ష సంహితగా చేంజ్‌
 • ఎవిడెన్స్ యాక్టుకు భారత సాక్ష బిల్లుగా నామకరణం
 •  కొత్త బిల్లులకు హిందీ పేర్లు పెట్టడంపై విపక్షాల ఆందోళన 
 • హిందీ పేర్లతో వల్ల న్యాయ ప్రక్రియలో  అయోమయం ఏర్పడే అవకాశం ఉందంటున్న విపక్షాలు

Advertisement
 
Advertisement