
► పార్లమెంట్‌లో ప్రతిష్టంభనలు తొలగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్‌లు విపక్ష ఫ్లోర్‌లీడర్లను కలిశారు. కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అయితే, పెగాసస్‌పై చర్చ విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తేలేదని విపక్షాలు స్పష్టం చేశాయి.
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పెగసస్‌పై విపక్షాలు పట్టుబట్టి ఆందోళనకు దిగడంతో రాజ్యసభ 12 గంటల వరకు, లోక్‌సభ 11:30 గంటల వరకు వాయిదా పడ్డాయి.
► ఎనిమిదవ రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో పోలవరంపై వైఎస్సార్ సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఎంపీ చింతా అనురాధ పోలవరంపై నోటీస్ ఇచ్చారు. వరించిన అంచనాలకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేయాలని ఈ నోటీసు ఇచ్చారు.