
లైవ్ అప్‌డేట్స్:
► రాజ్యసభ మంగళవారినికి వాయిదా పడింది.
► పార్లమెంట్‌లో సమావేశాల్లో భాగంగా లోక్ సభలో విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో లోక్ సభ మధ్యాహ్నం 3.30 గంటల వరకు వాయిదా పడింది.
► వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున రాజ్యసభలో నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో రాజ్య సభ మధ్యాహ్నం 3.30 గంటల వరకు వాయిదా పడింది.
►రాజ్యసభలో పీవీ సింధుకు అభినందనలు తెలిపిన అనంతరం విపక్ష సభ్యులు పెగసస్ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టారు. వరుసగా పదో రోజు విపక్షాల ఆందోళన చేపట్టింది. చర్చ లేకుండా బిల్లులు ఆమోదిస్తున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.
►పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు పదో రోజు ప్రారంభం అయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ)కు పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు అభినందనలు తెలిపారు.
►పోలవరంపై లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం చేసింది. పోలవరం అంచనా వ్యయాన్ని కేబినెట్ ఆమోదించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మాధవి స్పీకర్‌కు నోటీసు అందజేశారు.