మీతో పంచుకోవాల్సిందే, రికమెండేషన్స్‌ ప్లీజ్‌..సీరియస్లీ: రితేష్‌ ఎమోషనల్‌

OYO founder Ritesh Agarwal shares heartfelt post as he announces parenthood - Sakshi

 అన్ని వేళలా ఆమే నా ఏకైక బలం,ఇపుడిక సరికొత్తగా :రితేష్‌ అగర్వాల్‌

ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్  తన జీవితంలోని ఒక గుడ్‌ న్యూస్‌ తన అభిమానులతో పంచుకున్నారు.  తన భార్య గీతాన్షా సూద్ గర్భం దాల్చినట్టు ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో పెళ్లి చేసుకున్న రితేష్‌ సోషల్ మీడియాలో తాము తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్నామన్న  వార్తను పంచు కున్నారు. 

టీనేజర్‌గా, సొంత కంపెనీ పెట్టాలన్న కలలతో కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాల్లో ఉండగా, 11 ఏళ్ల క్రితం గీత్‌ను కలిశాను. అలా  టీనేజర్లుగా తరువాత  జంటగా, ఇపుడు తల్లిదండ్రులుగా మారబోతున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఈ విషయాన్ని మీతో పంచుకునేందుక సంతోషిస్తున్నామంటూ ఈ శుభవార్తను అందించారు.  

రికమెండేషన్స్‌ ప్లీజ్‌..సీరియస్లీ
అంతేకాదు న్యాపీలు, స్ట్రోలర్లు,  బొమ్మల కోసం సిఫార్సులను  షేర్‌ చేయాలంటూ  అగర్వాల్ నెటిజన్లను కోరారు.  మీరు ఏదైనా వినూత్నమైన స్టార్టప్‌ అయితే ఇంకా మంచిది. తీవ్రంగా,  తండ్రి స్థాయి జ్ఞానం కోసం మార్కెట్‌లో ఉన్నానంటూ రాశారు. ఈ సందర్భంగా తన పోస్ట్‌లో తన భార్యపై ప్రశంసలు కురిపించారు కూడా.కష్టాలు,కన్నీళ్లు, సంతోషం అనేక మైలురాళ్ల ప్రయాణంలో తన వెనుక గట్టి నిలబడ్డ ఏకైక వ్యక్తి గీత్‌ అంటూ రాసుకొచ్చారు రితేష్ అగర్వాల్.

దీంతో ఈ జంటకు ప్రశంసల వెల్లువ కురుస్తోంది. "ఓహ్! కంగ్రాట్స్!" అంటూ పాపులర్‌ రచయిత చేతన్ భగత్ వ్యాఖ్యానించారు.“ఆల్ ది బెస్ట్ రితేష్. పేరెంట్‌హుడ్ ఉత్తమమైనది, ” అని ఎడెల్‌వీస్  సీఎండీ రాధికా గుప్తా  అభినందలు తెలిపారు.మార్చి 7న రితేష్ అగర్వాల్ గీతాన్షా సూద్‌  వివాహం చేసుకున్నారు. రితేష అగర్వాల్‌ 2013లో ఓయోను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top