Ritesh Agarwal: ఆ పని చేసినందుకు రూ.20 టిప్పు ఇచ్చారు: తొలినాళ్లను గుర్తు చేసుకున్న ఓయో ఫౌండర్‌

OYO CEO Ritesh Agarwal received Rs 20 tip from angry customer - Sakshi

కెరియర్‌ తొలినాళ్లలో తాను పడిన ఇబ్బందులు, ఎదురైన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఓయో రూమ్స్‌ (OYO Rooms) ఫౌండర్‌ రితేష్‌ అగర్వాల్‌ (Ritesh Agarwal). కంపెనీకి బాస్‌గా మాత్రమే కాకుండా ఫ్రంట్ డెస్క్ మేనేజర్‌గా, అవసరమైనప్పుడు క్లీనింగ్ స్టాఫ్‌గా కూడా పనిచేసినట్లు వెల్లడించారు. 

అప్పుడు ఓయో ఇంకా ప్రారంభ దశలో ఉంది. రితేష్‌ అగర్వాల్ థీల్ ఫెలోషిప్‌ పూర్తి చేసుకుని అప్పుడే తిరిగివచ్చారు. ఈ  సమయంలో తన సంస్థ అభివృద్ధికి ఆయన చాలా కష్టపడ్డారు. హోటల్ సిబ్బందిగా పనిచేశారు. కస్టమర్ కేర్, ఫ్రంట్ డెస్క్ మేనేజర్‌గా అవసరమైనప్పుడు క్లీనింగ్ పని కూడా చేశారు. 

బిజ్ టాక్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రితేష్ అగర్వాల్ హోటల్ గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన సందర్భాన్ని వివరించారు. రూం క్లీనింగ్‌ ఆలస్యం కావడంతో ఓ కస్టమర్‌ చాలా కోపంగా ఉన్నాడు. అతనికి సర్దిచెప్పడానికి వెళ్లిన రితేష్‌ అగర్వాల్‌ను క్లీనింగ్ సిబ్బందిగా భావించి ఆ కస్టమర్‌ ఎడాపెడా తిట్టేశాడు. చివరికి రితేష్‌ అగర్వాల్ స్వయంగా ఆ గదిని శుభ్రం చేశాడు. దీంతో సంతృప్తి చెందిన కస్టమర్‌ తనకు రూ. 20 టిప్ ఇచ్చాడని రితేష్‌ అగర్వాల్‌ గుర్తు చేసుకున్నారు. 

హాస్పెటాలిటీ రంగంలో హౌస్‌కీపర్‌లు, డెస్క్ మేనేజర్‌లు వంటి సిబ్బంది పాత్రను, గొప్పతనాన్ని వివరిస్తూ తొలినాళ్లలో తనకు ఎదురైన అభువాన్ని వెల్లడించిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు రితేష్‌ అగర్వాల్‌. హాస్పిటాలిటీ పరిశ్రమలో నిజమైన తారలు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్లు, క్లీనింగ్ సిబ్బంది, రిసెప్షనిస్ట్‌లు, తెరవెనుక సిబ్బంది అంటూ అందులో రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: Prerna Jhunjhunwala: రూ. 330 కోట్ల యాప్‌.. ఈమె స్టార్టప్‌ పిల్లల కోసమే.. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top