అసలు ఊహించలేదు.. భారతీయ రైల్వేపై ఓ తల్లి ప్రశంసలు | Mother Shocked By How Indian Railways Helped Sick Baby | Sakshi
Sakshi News home page

అసలు ఊహించలేదు.. భారతీయ రైల్వేపై ఓ తల్లి ప్రశంసలు

Mar 22 2026 8:50 PM | Updated on Mar 22 2026 8:51 PM

Mother Shocked By How Indian Railways Helped Sick Baby

కదులుతున్న రైలులో అనారోగ్యానికి గురైన తన చిన్నారికి నిమిషాల వ్యవధిలోనే వైద్యుడిని ఏర్పాటు చేసి.. సకాలంలో వైద్య సహాయం అందించిన భారతీయ రైల్వేపై ఓ తల్లి ప్రశంసల జల్లు కురిపించారు. మార్చి 13న బెంగళూరు నుంచి గుజరాత్‌కు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటనను ఆమె తన  ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వెల్లడించారు.

వృత్తిరీత్యా దంత వైద్యురాలైన ఓ తల్లి.. పాపకు మునగకాయ సూప్ (drumstick soup) తాగించింది.  అనంతరం ఆ పాప పదేపదే వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. చిన్నారి పరిస్థితిపై ఆందోళన చెందిన ఆ తల్లి వెంటనే ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (TTE)ను సంప్రదించి రైలులో మందులు ఎలా తెప్పించుకోవచ్చని అడిగారు. వేగంగా స్పందించిన  రైల్వే సిబ్బంది.. రైలు హిందూపూర్ స్టేషన్‌కు చేరుకునే సరికి పాపకు వైద్యం అందించేందుకు అప్పటికే ఒక వైద్యుడిని సిద్ధంగా ఉంచారు. ఆ వైద్యుడు చిన్నారిని పరీక్షించి అవసరమైన మందులు అందించారు.

"నేను నా బిడ్డకు మునగకాయ సూప్ తాగించాను.. ఆ తర్వాత, పాపకు చాలా వాంతులు అయ్యాయి.. నేను భయపడి రైలులో మందులు ఎలా ఆర్డర్ చేయాలని టీటీఈని అడిగాను. కానీ నేను వారి నుంచి పెద్దగా సహాయం ఆశించలేదు. వారు ఎంత వేగంగా స్పందించారో చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నా బిడ్డకు సహాయం ఊహించిన దానికంటే వేగంగా వైద్యం అందింది. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అంటూ పోస్ట్‌ చేశారు

 

 

Advertisement
 
Advertisement
Advertisement