Rameshwaram Cafe Bomb Blast: యువ టెకీని కాపాడిన అమ్మ ఫోన్‌ కాల్‌ | Mother Unsual Phone Call Saved Bengaluru Techie From Rameshwaram Cafe Bomb Blast, See Details Inside - Sakshi
Sakshi News home page

Rameshwaram Cafe Bomb Blast: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ పేలుడు: యువ టెకీని కాపాడిన అమ్మ ఫోన్‌ కాల్‌

Mar 3 2024 7:58 AM | Updated on Mar 3 2024 1:32 PM

Mother Phone Call Saved Techie From Rameshwaram Cafe Blast - Sakshi

బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ పేలుడు నుంచి ఒక యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సినీ ఫక్కీలో తృటిలో తప్పించుకున్నాడు. శుక్రవారం(మార్చ్‌ 1)మధ్యాహ్నం ఒంటిగంటకు పేలుడు జరిగిన సమయంలో బిహార్‌కు చెందిన టెకీ కుమార్‌​ అలంకృత్‌ రామేశ్వరం కేఫ్‌లో లంచ్‌ చేస్తున్నాడు.

పేలుడు జరడానికి కొద్ది క్షణాల ముందు అలంకృత్‌కు అతడి తల్లి నుంచి ఫోన్‌ వచ్చింది. ఫోన్‌ మాట్లాడటం కోసం అలంకృత్‌ కేఫ్‌ బయటికి వచ్చాడు. ఇంతలో కేఫ్‌ లోపల పేలుడు జరిగింది. ఈ పేలుడులో 9 మంది గాయపడ్డారు. 

ఘటన తర్వాత అలంకృత్‌ మాట్లాడుతూ‘నేను లంచ్‌ కోసం కేఫ్‌కు వచ్చాను. ఇడ్లీ తినడం పూర్తి చేసి దోశ తినడం స్టార్ట్‌ చేద్దామనుకునే లోపు మా అమ్మ నుంచి ఫోన్‌ వచ్చింది. ఫోన్‌ పట్టుకుని బయటికి వెళ్లాను. ఇంతలో పేలుడు జరిగింది. గ్యాస్‌ సిలిండర్‌ పేలిందేమో అని మొదట అనుకున్నాను. ఎలా ఉన్నావు. తిన్నావా.. లేదా అని అడగడానికి మా అమ్మ ఫోన్‌ చేసింది. అమ్మ నుంచి ఫోన్‌ రాకపోయి ఉంటే నేను ఉండేవాడిని కాదు’అని అలంకృత్‌ చెప్పాడు. 

ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్‌ బ్లాస్ట్‌లో కీలకంగా ఏఐ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement