స్వల్ప వివాదానికే వ్యాపారిని కొట్టి చంపేశారు! | UP Mob kills man after accident in Varanasi four arrested | Sakshi
Sakshi News home page

స్వల్ప వివాదానికే వ్యాపారిని కొట్టి చంపేశారు!

Apr 29 2026 2:13 PM | Updated on Apr 29 2026 2:45 PM

UP Mob kills man after accident in Varanasi four arrested

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దారుణం  చోటు చేసుకుంది. వారణాసిలోని ఘమ్‌హాపూర్ గ్రామంలో, 38 ఏళ్ల వ్యాపారవేత్తను సామూహిక హత్య కలకలం  రేపింది. కారుతో ఒక మహిళను ఢీకొట్టాడన్న ఆగ్రహంతో స్థానికులు మూకదాడికి పాల్పడి అతడిని కొట్టి చంపారు. 

మృతుడిని మనీష్ సింగ్‌గా గుర్తించారు. డీసీపీ (గోమతి జోన్) నీతు కాడియన్  అందించిన వివరాల ప్రకారం  ఆదివారం రాత్రి, సింగ్ తన ఫ్యాక్టరీ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, అతని కారు  రోడ్డు పక్కన నడుస్తున్న ఒక మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం, ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మక ఘర్షణగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు మనీశ్ కుమార్‌ను కారులో నుంచి బయటకు లాగి ఇటుకలు, రాళ్లతో కొట్టి అత్యంత కిరాతకంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతడిని బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ఫూల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని,  పాత కక్షలు, దోపిడీ, ప్రమాదం అంశాలపై దర్యాప్తు జరుగుతోందని డీసీపీ కాడియన్ తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఒక అధికారి మంగళవారం (ఏప్రిల్ 27) తెలిపారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. ఈ ఘటనతో బాధితుడి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు.

 ఇదీ చదవండి: ‘బోష్‌’ మహిళా ఉద్యోగిని అనుమానాస్పద మరణం

Advertisement
 
Advertisement
Advertisement