Women Working On Oil Rigs: ఆ సమయంలో కూడా సేవలందించిన సూపర్‌ ఉమెన్‌లు

Minister Hardeep Puri Lauds Women Working On Oil Rigs - Sakshi

Hardeep Singh Puri Praises Working On Oil Rigs: దేశంలోని చమురు, గ్యాస్ ఇన్‌స్టాలేషన్‌లలో పనిచేసే మహిళల సహకారాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌లో ఆరెంజ్‌ కలర్‌ యూనిఫామ్‌ ధరించి పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ కరోనా మహమ్మారి సమయంలో కూడా ఈ మహిళలు సుమారు 60 నుండి 70 రోజుల పాటు డ్రిల్లింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై ఉండి సేవలందించారని పూరి చెప్పారు.

(చదవండి: మృత్యుంజయురాలు! ...ఐదు రోజులుగా గడ్డకట్టే మంచులో కారులోనే ...)

అంతేకాదు వారి తమ కార్పోరేషన్‌లో కఠినమైన నిబద్ధత, దృఢత్వంతో  పనిచేసే  సూపర్‌ ఉమెన్‌ మాత్రమే కాదు దేశ ప్రగతిలో "సమాన భాగస్వామ్యులు"గా  అభివర్ణించారు. పైగా మీరే మాకు గర్వకారణం అంటూ ప్రశంసించారు. ఈ మేరకు నెట్టింట్లో ఈ ఫోటోలు వైరల్‌ అవ్వడంతో నెటిజన్లు కూడా మహిళలను ప్రోత్సహించే నిమిత్తం మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు. అంతేకాదు లడఖ్‌లోని ఫే గ్రామంలో 11,800 అడుగుల ఎత్తైన ఎల్‌పిజి బాట్లింగ్ ప్లాంట్‌ను ఇండియన్ ఆయిల్‌కు చెందిన మహిళా ఉద్యోగుల బృందమే నిర్వహించారన్న సంగతి తెలిసిందే.

(చదవండి: పోలీస్‌ కమిషనర్ పేరుతో పోలీసులనే బురిడి కొట్టించాడు!!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top