గిన్నిస్‌ రికార్డ్‌ కోసం నీళ్లలో..

Man Solve Rubiks Cube Puzzle In Underwater And Wins Guinness Record - Sakshi

చెన్నై : రూబిక్స్‌ క్యూబ్‌‌ పజిల్‌ను సాల్వ్‌ చేయటం అంత సులభమైన పని కాదు. ఏళ్ల తరబడి అభ్యాసం ఉంటే కానీ వాటిని పూర్తి చేయటం సాధ్యపడదు. అలాంటిది నీళ్లలో మునిగి రూబిక్స్‌ పజిల్‌ను పూర్తి చేయటం అంటే!.. అస్సలు చేతకాదని చేతులెత్తేస్తాం. కానీ, చెన్నైకి చెందిన ఇళయరామ్‌ శేఖర్‌ మాత్రం తన అత్యుత్తమమైన ప్రతిభతో గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించాడు. 2.17 నిమిషాలు నీళ్లలో ఉండి మొత్తం  6 రూబిక్స్‌ పజిళ్లను పూర్తి చేశాడు. ఇందుకోసం ఏకంగా రెండేళ్ల పాటు కఠోర కృషి చేశాడు. అంతకు క్రితం ఐదు రూబిక్స్‌పై‌ ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. (మిలియ‌నీర్లుగా యూట్యూబ్ స్టార్లు!)

జీడబ్ల్యూఆర్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌ ఈ వీడియోను తమ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఆగస్టు 22న ఈ వీడియోను షేర్‌ చేయగా ఇప్పటి వరకు దాదాపు లక్ష వ్యూస్‌ సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నేను మామూలుగానే రూబిక్స్‌ క్యూబ్‌ పజిల్‌ను సాల్వ్‌ చేయలేను. ఈయన ఏకంగా నీళ్లలో చేస్తున్నాడు.. అతడు రెండు నిమిషాలు నీళ్లలో ఉన్నాడు.. అద్భుతం ’’ అంటూ పొగిడేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top