కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి సంచలన ప్రకటన చేసింది. సీఎంగా తాను ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయనని అవసరమైతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని తెలిపింది. ఎన్నికల్లో విపరీతంగా అక్రమాలు జరిగాయని అందుమూలంగానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బెంగాల్ రాజకీయాలు మారోసారి హాట్‌టాఫిక్‌గా మారాయి.
ఫలితాలు వచ్చిన అనంతరం మమతా మాట్లాడుతూ "ప్రజాతీర్పుతో మేం ఓడిపోలేదు. కుట్ర చేసి మమ్మల్ని తక్కువ సీట్లకు పరిమితం చేశారు. అలాంటప్పుడు నేను రాజీనామా చేయాలనే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది? నేను ఓడిపోలేదు. లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామాలేఖ సమర్పించే ప్రసక్తే లేదు". అంది.
అయితే మమతా బెనర్జీ పలుమార్లు ఇలా వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రి గవర్నర్ యొక్క విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే పదవిలో కొనసాగుతారు. ముఖ్యమంత్రి సభలో (అసెంబ్లీలో) మెజారిటీని కోల్పోతే, గవర్నర్ వారిని తొలగించవచ్చు లేదా రాజీనామా చేయాలని కోరవచ్చు.
ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన ముఖ్యమంత్రి తాను రాజీనామా చేయబోనని మొండికేస్తే రాజ్యాంగం ప్రకారం గవర్నర్ తదుపరి కార్యాచరణను అమల్లోకి తీసుకురావచ్చు. ఆ అధికారం రాజ్యాంగం గవర్నర్‌కు ప్రసాదించింది. శాసనసభ అనేది శాశ్వతసభ కాదు. ఐదేళ్ల కాలపరిమితి ముగియగానే శాసనసభ రద్దవుతుంది.
పాత ముఖ్యమంత్రి తనకు కొత్త ఎమ్మెల్యేల్లో సరిపడా బలం ఉందని విశ్వసిస్తే బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించవచ్చు. అయితే తాజా ఎన్నికల్లో టీఎంసీ ఎమ్మెల్యేల సంఖ్య సాధారణ మెజారిటీకి సరిపడా లేదు కాబట్టి బలనిరూపణలో మమత ఓడిపోవడం ఖాయం. మెజారిటీ సీట్లు సాధించిన పార్టీనే గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు.
కాగా ఇదివరకే టీఎంసీ ప్రభుత్వ కాలపరిమితి ముగిసింది . దీంతో రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం చూసినా టీఎంసీ పాలన ముగిసినట్లే. మమత ఆటోమేటిక్‌గా సీఎం పదవిని కోల్పోయినట్లే లెక్క. గవర్నర్ కోరనిది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం కూడా మమతకు లేదు.


