
ముంబై: ముంబైలోని ఆకాశవాణి ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటీన్‌ను నిర్వహిస్తున్న క్యాటరర్ లైసెన్స్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)సస్పెండ్ చేసింది. పాచిపోయిన పప్పు వడ్డించారనే ఆరోపణలతో శివసేన శాసనసభ్యుడు సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ సిబ్బందిపై దాడి చేసిన దరిమిలా ఎఫ్‌డీఏ చర్యలు చేపట్టింది.
ఎఫ్‌డీఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్- 2006లోని కీలక నిబంధనలను, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్- 2011ను ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటీన్ ఉల్లంఘించించింది. హాస్టల్‌లో నిర్వహించిన తనిఖీలలో పలు ఉల్లంఘనలు బయటపడినట్లు ఎఫ్‌డీఏ తెలిపింది. పన్నీర్, చట్నీ, నూనె, కంది పప్పు నమూనాలను సేకరించిన అధికారులు వాటిని ల్యాబ్‌కు పంపుతామని, 14 రోజుల్లోగా నివేదిక వస్తుందని తెలిపారు. జూలై 10 నుండి హాస్టల్ ప్రాంగణంలో అన్ని ఆహార సేవల కార్యకలాపాలను నిలిపివేయాలని ఆహార నియంత్రణ సంస్థ ఆదేశించింది.
#WATCH | Mumbai: Food and Drug Administration (FDA) officials took food samples from the Akashvani MLA canteen. Shiv Sena MLA Sanjay Gaikwad thrashed a canteen employee here yesterday, alleging poor quality of food
"Samples of paneer, Schezwan chutney, oil and toor dal have been… pic.twitter.com/SZw4hhBRuS— ANI (@ANI) July 9, 2025
శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఎమ్మెల్యేల హాస్టల్ క్యాంటీన్‌లో ఒక నిర్వాహకునిపై చేయిచేసుకున్న ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. గైక్వాడ్ ఎమ్మెల్యే హాస్టల్‌లోని తన గదికి భోజనం ఆర్డర్ చేయగా, వచ్చిన ఆహారంలో పప్పు దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన క్యాంటీన్‌లోని సిబ్బందిపై చేయిచేసుకుని, బిల్లు చెల్లించడానికి నిరాకరించారు. తరువాత ఆయన తాను ఎవరికీ క్షమాపణ చెప్పనని, ఈ విషయంలో ఎటువంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశారు. హోటల్‌పై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు.