మధ్యప్రదేశ్‌లో భారీ పేలుడు.. పలువురి మృతి | Madhya Pradesh Dewas Firecracker Factory Blast News Updates | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో భారీ పేలుడు.. పలువురి మృతి

May 14 2026 12:48 PM | Updated on May 14 2026 12:55 PM

Madhya Pradesh Dewas Firecracker Factory Blast News Updates

మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. దేవాస్‌ జిల్లాలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి షెడ్డు కుప్పకూలిపోగా.. అందులో పనిచేసే కార్మికులు చెల్లాచెదురుగా పడ్డారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు.

స్థానిక మీడియా చానెల్స్‌ ఇస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇప్పటిదాకా నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఇండోర్‌కు తరలిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement