
సాక్షి బెంగళూరు: అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా రామ నామం మారుమోగుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని ఓ కళాకారుడు నాణేలతో శ్రీరాముని కళాకృతిని తయారు చేశాడు. రూపాయి, ఐదు రూపాయల విలువ కలిగిన అరవై వేల నాణేలను ఉపయోగించి శ్రీరాముని కళాకృతిని తీర్చిదిద్దారు. నాణేల విలువ సుమారు రూ.2 లక్షలు. రాజధాని బెంగళూరులోని లాల్‌బాగ్ పశ్చిమ ద్వారం వద్ద కళాకృతిని సిద్ధం చేశాడు.