Live Updates
బెంగాల్ పోలింగ్: ఐదు గంటలకే 90 శాతం దాటిన పోలింగ్
బెంగాల్‌లో ముగిసిన రెండో విడత పోలింగ్
- రెండో విడత పోలింగ్‌లో 91.41 శాతం ఓటింగ్ నమోదు.
- తొలిదశలో 93 శాతం పోలింగ్ నమోదు.
- రెండు విడతల్లో రికార్డు స్థాయిలో పోలింగ్.
బెంగాల్‌లో ముగిసిన తుదిదశ పోలింగ్
- సాయంత్రం ఆరుగంటలు కావడంతో పోలింగ్‌కు ముగింపు
- క్యూలైన్లలో నిలిచిఉన్న వారికి ఓట్లు వేసే అవకాశం
- సాయంత్రం ఆరు గంటల లోపు క్యూలైన్లో ఉన్నవారికి అవకాశం
బెంగాల్‌లో ముగిసిన తుది విడత పోలింగ్
- బెంగాల్‌లో ముగిసిన తుది విడత పోలింగ్
- బెంగాల్‌లో సాయంత్రం 5 గంటల వరకు 90 శాతం పోలింగ్ నమోదు
- సాయంత్రం 6 లోపు క్యూలెన్లలో ఉన్నవారికి ఓటువేసేందుకు అవకాశం
బెంగాల్‌లో 90 శాతం దాటిన పోలింగ్
- బెంగాల్‌లో 90 శాతం దాటిన పోలింగ్
- సాయంత్రం ఐదు గంటల వరకే 90 శాతం పోలింగ్
- సాయంత్రం ఆరు గంటలకు ముగియననున్న పోలింగ్
మరో గంట సమయం ఉండడంతో మరింత పెరగనున్న పోలింగ్
భవానీపూర్‌లో ఓటేసిన మమతా బెనర్జీ
- భవానీపూర్‌లో ఓటేసిన మమతా బెనర్జీ
- బీజేపీపై తీవ్ర విమర్శలు
- కేంద్రబలగాల తీరుపై మండిపడ్డ మమతా బెనర్జీ
- ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆరోపణ
బెంగాల్‌లో జోరుగా సాగుతున్న పోలింగ్
- బెంగాల్‌లో జోరుగా కొనసాగుతున్న పోలింగ్
- ఉత్సాహంగా ఓట్లు వేస్తున్న ఓటర్లు
- మూడు గంటల వరకే 78 శాతం దాటిన పోలింగ్
- తొలిదశలో 93 శాతం పోలింగ్ నమోదు
- రెండో విడతలోనూ భారీ పోలింగ్ నమోదయ్యే అవకాశం
మధ్యాహ్నం 3 గంటల వరకు 78 శాతం దాటిన పోలింగ్
- పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న తుదిదశ ఎన్నికల పోలింగ్
- మధ్యాహ్నం 3గంటల వరకు 78.68 శాతం పోలింగ్ నమోదు
ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు.. పలు చోట్ల పోలింగ్ నిలిపివేత
హార్బర్‌లోని ఫల్తా ప్రాంతంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిలిపివేత
తృణమూల్ పార్టీ ఓటింగ్ యంత్రాలను తారుమారు చేసిందంటూ బీజేపీ ఆరోపణలు
పశ్చిమ బెంగాల్‌లో బాంబుల కలకలం
- పశ్చిమ బెంగాల్‌లో బాంబుల కలకలం
- పుర్చా బర్దమాన్ జిల్లాలో ఓ బ్యాగ్‌లో బాంబుల గుర్తింపు
- ఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్స్
1గం.. 61 శాతం పోలింగ్
- బెంగాల్‌లో కొనసాగుతున్న పోలింగ్
- మధ్యాహ్నాం 1గం. వరకు 61 శాతం పోలింగ్
- బెంగాల్‌లో పలు చోట్ల మారిన వాతావరణం
- వర్షంలోనూ పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు
బెంగాల్‌లో సువేందుకు చేదు అనుభవం
- కొనసాగుతున్న తుదిదశ ఎన్నికల పోలింగ్
- బీజేపీ లీడర్, ప్రతిపక్ష నేత సువేందు అధికారికి చేదు అనుభవం
- పోలింగ్ శైలిని పరిశీలిస్తుండగా ఓటర్ల నుంచి వ్యతిరేక నాదాలు
- జై బంగ్లా అంటూ నినాదాలు చేసిన కొందరు
- పోలింగ్ బూత్ నుంచి వెళ్లిపోయిన సువేందు
బెంగాల్‌లో ఓటర్ల జోష్.. 40 శాతం పోలింగ్
- బెంగాల్‌లో ఓటర్ల జోష్.. 40 శాతం పోలింగ్
- పశ్చిమబెంగాల్ పోలింగ్ జోరు
- ఉదయం 11 గంటల వరకు 40 శాతం పోలింగ్ నమోదు
- పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు
దీదీకి స్ట్రాంగ్ కౌంటర్
- కొనసాగుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- 142 అసెంబ్లీ స్థానాల్లో కొనసాగుతున్న ఓటింగ్
- భవానీపూర్ నియోజకవర్గంలో వార్డ్ నెంబర్ 70 పోలింగ్ కేంద్రం వద్ద ఎదురుదెరు పడ్డ మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత సువేందు అధికారి
- అంతకు ముందు.. బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని మమతా బెనర్జీ వ్యాఖ్య
- ఎన్నికల పరిశీలకులు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శ
- కేంద్ర బలగాలు కూడా బీజేపీకే పని చేస్తున్నాయి
- టీఎంసీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
- ప్రజాస్వామ్యబద్ధంగా.. శాంతియుత వాతావరణంలో జరగాల్సిన పోలింగ్‌ను బీజేపీ చెడగొట్టిందని మండిపాటు
- కౌంటర్ ఇచ్చిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి
- దీదీని చూపిస్తూ.. ‘‘ఆమెను చూడండి.. ఈరోజు ఆమెకు ఎవరూ ఓటు వేయడం లేదు: సువేందు అధికారి
- ఆమెకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకు టీఎంసీ గుండాలూ ఓటర్లను బెదిరిస్తున్నారు: సువేందు అధికారి
- మరీ ముఖ్యంగా హిందూ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని టీఎంసీ బెదిరింపులు కొనసాగుతున్నాయి : సువేందు అధికారి
- బెంగాల్‌లో బీజేపీ గెలుపు తథ్యం: సువేందు అధికారి
- ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేదెక్కిన వాతావరణం
VIDEO | West Bengal: BJP candidate from Nandigram and Bhabanipur, Suvendu Adhikari says, "Mamata Banerjee is scared, nothing else. Her police has been replaced by CAPF that is why she is scared. The Election Commission has deployed the CAPF here so if she has any kind of problem,… pic.twitter.com/bIj3M7DQxN
— Press Trust of India (@PTI_News) April 29, 2026
ఉదయం 9గం. .. 18.39 శాతం పోలింగ్
- బెంగాల్‌లో చివరి విడత ఎన్నికల పోలింగ్
- ఉదయం నుంచే పోటెత్తిన ఓటర్లు
- ఉదయం 9గం. దాకా 18.39 శాతం పోలింగ్
మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
- కొనసాగుతున్న పశ్చిమ బెంగాల్ పోలింగ్
- పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూలు
- సంచలన ఆరోపణలకు దిగిన సీఎం మమతా బెనర్జీ
- ప్రతిపక్షం రిగ్గింగ్‌కు పాల్పడుతోందని.. కేంద్ర బలగాలు బీజేపీ తరఫున పనిచేస్తున్నాయని ఆరోపణ
- టీఎంసీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయన్న దీదీ
- ఎన్నికల పరిశీలకులు కూడా బీజేపీ సూచనల మేరకు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు
- టీఎంసీ పార్టీ పోస్టర్లు, జెండాలు బలవంతంగా తొలగించారని మండిపాటు
హౌరాలో టెన్షన్
- బెంగాల్‌లో కొనసాగుతున్న పోలింగ్
- పొద్దున్నే పోటెత్తిన ఓటర్లు
- పోలింగ్ కేంద్రాల ముందు భారీగా క్యూ లైన్లు
- కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటేస్తున్న బెంగాలీలు
- సాయంత్రం 6గం. దాకా పోలింగ్
- హౌరాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
- బీజేపీ, టీఎంసీ శ్రేణుల మధ్య గొడవ
- ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
- పలువురిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కకు తరలించిన పోలీసులు
- కోల్‌కతా, హౌరా, హుగ్లీ, నాదియా, 24 సౌత్ పరగణాలు, బర్దమాన్, ముర్షిదాబాద్ జిల్లాల్లో పోలింగ్
- మరోసారి భవానీపూర్‌లో మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి
బెంగాల్‌లో పోటెత్తిన ఓటర్లు
- పోటెత్తిన బెంగాల్ ఓటర్లు
- ఉదయం నుంచి భారీ క్యూ లైన్లు
- కీలక స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్
- ప్రత్యేక ఆకర్షణగా భవానీపూర్
- మరోసారి మమత కోటలో పోటీ పడుతున్న సువేందు అధికారి
- ఉదయాన్నే ఓటసిన ప్రముఖులు
#WATCH | West Bengal Assembly Elections 2026: TMC MP Mahua Moitra casts her vote at polling booth number 120, Karimpur Girls High School in Nadia pic.twitter.com/x9rPVqIBoQ
— ANI (@ANI) April 29, 2026
బెంగాల్ పోలింగ్.. రంగంలోకి ఎన్‌ఐఏ
- పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న తుది విడత పోలింగ్
- ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా తరలి వస్తున్న ఓటర్లు
- స్టేట్‌లో హాట్ సీట్లలో సాగుతున్న పోలింగ్
- భవానీపూర్‌లో మమతా బెనర్జీ V/S సువేందు అధికారి
- ఉత్తర, దక్షిణ 24 పరగణాల్లో పోలింగ్ ప్రారంభం
- సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
- ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత
- ఇప్పటికే దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భాంగర్‌లో 79 నాటు బాంబులు స్వాధీనం
- జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏను రంగంలోకి దించిన ఈసీ
- ఏడు జిల్లాల్లో 2,321 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపు
- సెకండ్ ఫేజ్ ఎన్నికల అబ్జర్వర్‌గా యూపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్‌పాల్ శర్మ
ప్రారంభమైన పోలింగ్
- పశ్చిమ బెంగాల్‌లో నేడు బిగ్ ఫైట్
- ప్రారంభమైన చివరి విడత పోలింగ్
- పోలింగ్‌కు ముందే భారీగా క్యూ లైన్‌లు
- ఇవాళ 142 స్థానాలకు పోలింగ్
- బరిలో 1448 మంది అభ్యర్థులు
- భవానీపూర్‌లో మమతా బెనర్జీ వర్సెస్ సువెందు అధికారి
మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం
- పశ్చిమ బెంగాల్‌లో మరికాసేపట్లో మలి విడత పోలింగ్
- 142 నియోజకవర్గాల్లో జరగనున్న ఓటింగ్
- ఉదయాన్నే ముగిసిన మాక్ పోలింగ్
- భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం
- భద్రత కోసం 2,321 మంది మోహరింపు
- ఏప్రిల్ 23న 152 నియోజకవర్గాలకు జరిగిన తొలి విడత పోలింగ్
- బెంగాల్ చరిత్రలోనే అత్యధికంగా 92 శాతం ఓటింగ్ నమోదు
- ఇవాళ్టి చివరి విడత ఓటింగ్ శాతంపై నెలకొన్న ఉత్కంఠ
- మే 4న వెలువడనున్న బెంగాల్ ఎన్నికల పలితాలు
బరిలో దీదీ, సువేందు అధికారి
- నేడు పశ్చిమ బెంగాల్‌లో చివరి(రెండో) విడత పోలింగ్
- బరిలో సీఎం మమతా బెనర్జీ, ప్రధాన ప్రతిపక్ష సువేందు అధికారి
- అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటల్లో ఓటింగ్
- కోల్‌కతా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నదియా, హుగ్లీ, పూర్బా బర్ధమాన్ జిల్లాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న ఓటర్లు
- 2021 ఎన్నికల్లో ఈ 142 స్థానాల్లో టీఎంసీ హవా
- 2021 శాసనసభ ఎన్నికల్లో ఈ 142లో 123 చోట్ల నెగ్గిన టీఎంసీ
- 18 చోట్ల బీజేపీ, ఒక స్థానంలో ఐఎస్‌ఎఫ్ గెలిచాయి.
- అయితే గత ఐదేళ్లలో మారిన సీన్
- ఈ 142 స్థానాల్లో క్షేత్రస్థాయిలో బాగా వేళ్లూనుకున్న బీజేపీ
- కీలకంగా మారనున్న ఉత్తర 24 పరగణాలు(33 సీట్లు), దక్షిణ 24 పరగణాలు(31 సీట్లు), హౌరా(16), నదియా(17), హుగ్లీ(18), పూర్బా బర్ధమాన్(16), కోల్‌కతా(11 సీట్లు) పోలింగ్
ఫేస్-2 పోలింగ్.. భారీగా సిబ్బంది మోహరింపు
- బెంగాల్ మలి విడత పోలింగ్ కోసం భారీగా భద్రతా ఏర్పాట్లు
- 142 మంది సాధారణ పర్యవేక్షకులు, 95 మంది పోలీస్ పర్యవేక్షకులు, 100 మంది ప్రత్యేక పర్యవేక్షకులు
- భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు, పారా మిలిటరీ దళాలు
- ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించేందుకు ఈసీ ప్రయత్నం
- పోలింగ్ నేపథ్యంలో టూవీలర్స్ ర్యాలీలపై నిషేధం
- బైక్‌పై ఇద్దరు వెళ్లేందుకు కూడా అనుమతి నిరాకరణ
- అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి
- ఓటేసేవాళ్లకు కూడా అనుమతి

మలియుద్ధం.. నేడే
- పశ్చిమబెంగాల్ రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం
- నేతల తలరాతల్ని నిర్ణయించనున్న 3 కోట్ల మంది ఓటర్లు
- 1,64,35,627 మంది పురుషులు, 1,57,37,418 మంది స్త్రీలు, 792 మంది ట్రాన్స్‌జెండర్లు
- మొత్తంగా 3,21,73,837 ఓటర్లు
- 41,001 పోలింగ్‌స్టేషన్లలో పోలింగ్
- 142 స్థానాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి


