ఢిల్లీ లిక్కర్‌ స్కాం: ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

Liquor Policy Case: Sisodia Sent To Judicial Custody Till April 5 - Sakshi

ఢిల్లీ: లిక్కర్‌ స్కాంలో అరెస్టయిన(సీబీఐ, ఈడీ ద్వారా) ఆప్‌ కీలక నేత మనీష్‌ సిసోడియా కస్టడీని ఢిల్లీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈ కేసులో కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ ముగియడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఆయన్ని ఇవాళ(బుధవారం) రౌస్‌ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. 

దీంతో.. స్పెషల్‌ జడ్జి ఎంకే నాగ్‌పాల్‌, సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని ఏప్రిల్‌ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ ఆదేశించారు. ఇక సిసోడియాను ఈడీ వారంగా తమ కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన సంగతి తెలిసే ఉంటుంది. 

మరోవైపు సీబీఐ విచారిస్తున్న లిక్కర్‌ పాలసీ కేసులో బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనపై విచారణను మంగళవారం ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. బెయిల్ అభ్యర్థనపై శనివారం విచారణ జరగనుంది.

ఫిబ్రవరి 26వ తేదీన విచారణ కోసం పిలిపించుకున్న సీఐబీ.. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలోనే ఆయన్ని అరెస్ట్‌ చేయడం తెలిసిందే. ఇక.. మనీల్యాండరింగ్‌ అభియోగాలకుగానూ ఈడీ, సిసోడియాను మార్చి 9వ తేదీన తీహార్‌ జైల్లో అరెస్ట్‌ చేయడం గమనార్హం.

ఇదీ చదవండి: మోదీకి వ్యతిరేకంగా వేల ఫ్లెక్సీలు

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top