
కర్ణాటక రాష్ట్రం: బెంగళూరు బన్నేరుఘట్ట సమీపంలో బసవనహళ్లి గ్రామంలో తన భార్య ప్రియునిపై వ్యక్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. మంజునాథ్ భార్య లీలావతి.. సంతు ఏళె అనే వ్యక్తితో వెళ్లిపోయింది. ఇద్దరు కొడుకులు, ఓ కూతురుని భర్త వద్దే వదిలేసింది. మంజునాథ్ న్యాయం చేయాలని బన్నేరుఘట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో పోలీసులు ఇద్దరిని వెతికి పట్టుకొచ్చారు.
తాను భర్తతో కాపురం చేయనని లీలావతి తెగేసి చెప్పింది. పిల్లల ముఖం చూసి అయినా ఇంటికి రావాలని మంజునాథ్ వేడుకున్నా లీలావతి ససేమిరా అంది. ఈ విషయమై భర్త సోషల్ మీడియా ద్వారా గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హుళిమావు పరిధిలోని బసవనపురలో సంతు ఇంటికి వెళ్లిన మంజునాథ్ గొడవ పడ్డాడు. బీర్ బాటిల్ తీసుకొని దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సంతు ఇందిరాగాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హుళిమావు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.