ఏపీలో ఇంధన కొరత..NHRCకి కేతిరెడ్డి ఫిర్యాదు | Kethireddy Jagadishwar Reddy Letter To NHRC Over Fuel Shortage In Andhra Pradesh, Seeks Urgent Action Across States | Sakshi
Sakshi News home page

ఏపీలో ఇంధన కొరత..NHRCకి కేతిరెడ్డి ఫిర్యాదు

Apr 28 2026 4:24 PM | Updated on Apr 28 2026 4:55 PM

Kethireddy Jagadishwar Reddy letter to NHRC over fuel shortage in andhra pradesh

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇంధన కొరతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేంద్ర పెట్రోలియం శాఖ, సుప్రీంకోర్టు లీగల్ సెల్, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రాలు పంపింది.

కేతిరెడ్డి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఫిర్యాదులో దేశంలో ఇంధన కొరత సామాన్యుల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. రవాణా అంతరాయం, అత్యవసర సేవలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. ఈ కొరత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవన హక్కు), ఆర్టికల్ 14 (సమాన హక్కులు)తో పాటు వినియోగదారుల హక్కులకు భంగం కలిగిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

తక్షణ చర్యల కోసం నిల్వల పారదర్శకత, ఆకస్మిక తనిఖీలు, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు, డిజిటల్ పర్యవేక్షణ, ప్రజా డ్యాష్‌బోర్డ్, వినియోగదారుల ఫిర్యాదు వ్యవస్థ, రాష్ట్రాలతో సమన్వయం వంటి సూచనలు చేశారు. అలాగే ఐవోసీఎల్‌,బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, దేశవ్యాప్తంగా అంతరాయం లేకుండా సరఫరా జరిగేలా చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement