
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరయ్యే విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఎనిమిదోసారి హ్యాండిచ్చారు. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరవ్వాల్సిందిగా ఇటీవలే ఎనిమిదవసారి ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది. ఈ విచారణకు సోమవారం ఈడీ ఎదుటకు రావాల్సి ఉండగా కేజ్రీవాల్ రాలేదు.
సోమవారం(మార్చి 4) తాను ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నందునే విచారణకు హాజరవడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఈసారి మాత్రం ఈడీకి ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చారు. మార్చ్ 12వ తేదీన ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని సమాచారమిచ్చారు. కాగా, లిక్కర్ పాలసీ కేసులో గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 22, జనవరి 3, 2024, జనవరి 18, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 26, మార్చ్ 4వ తేదీల్లో ఇప్పటికి ఎనిమిదిసార్లు ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు.
ఇదీ చదవండి.. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. కేంద్రం కీలక నిర్ణయం