గర్భవతి సాహసం.. 400 మీటర్లు పరిగెత్తి

Karnataka Pregnant Woman Clear Physical Tests For Cop Job - Sakshi

ఎస్సై ఫిజికల్‌ ఈవెంట్స్‌లో క్వాలిఫై అయిన గర్భవతి

కర్ణాటకలో వెలుగు చూసిన సంఘటన

బెంగళూరు: పోలీసు ఉద్యోగం అంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకోసం ఎప్పటి నుంచో దీక్షగా చదువుతుంది. మరి కొద్ది రోజుల్లో పోలీసు ఫిజికల్‌ ఈవెంట్స్‌ ఉండగా తాను గర్భవతని తెలిసింది. వైద్యులు ఆమెను ఇలాంటి సాహసాలు చేయవద్దని సూచించారు. కానీ ఆమె ధైర్యం చేసి ఈవెంట్స్‌కి అటెండ్‌ అయ్యింది. క్వాలిఫై అయ్యింది. ఆ తరువాత విషయం తెలియడంతో ఉన్నతాధికారులు ఆమె సాహసాన్ని ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు..

కర్ణాటక కలబురాగికి చెందిన అశ్విని సంతోష్‌ కోరే(24)కు పోలీసు ఉద్యోగం అంటే చాలా ఇష్టం. దానికోసం శ్రద్ధగా చదువుతోంది. ఇక డిపార్ట్‌మెంట్‌ జాబ్‌ అంటే రన్నింగ్‌, జంపింగ్‌ వంటి పరీక్షలు కూడా ఉంటాయి. అయితే అశ్విని ఇప్పటికి రెండు సార్లు ఫిజికల్‌ ఈవెంట్స్‌ క్వాలిఫై అయ్యింది... కానీ రాత పరీక్షలో విఫలం అయ్యింది. ఈ క్రమంలో మూడో సారి మరింత దీక్షగా చదవడం ప్రారంభించింది.

ఈ క్రమంలో ఈవెంట్స్‌కు మరికొన్ని రోజులుందనగా అశ్వినికి తాను గర్భవతినని తెలిసింది. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి. గైనకాలజిస్ట్‌ను కలిసి.. పరిస్థితి వివరించింది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు పరిగెత్తడం లాంటి పనులు చేయకూడదని హెచ్చరించింది. కానీ ఈ అవకాశాన్ని వదులుకుంటే కలల జాబ్‌ దూరమవుతుంది.

బాగా ఆలోచించిన అశ్విని అధికారుల దగ్గరకు వెళ్లి తన పరిస్థితి వివరించింది. 400 మీటర్ల పరుగు పందెం నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. కానీ వారు అంగీకరించకపోవడంతో.. తప్పనిపరిస్థితుల్లో అశ్విని దానిలో పాల్గొంది. 2 నిమిషాల టార్గెట్‌ కాగా.. అశ్విని 1.36 సెకన్లలో దాన్ని పూర్తి చేసి.. అందరిని ఆశ్చర్యపరిచింది. 

ఈ సందర్భంగా ఐజీపీ మాట్లాడుతూ.. ‘‘అశ్విని గర్భవతి అనే విషయం మాకు తెలియదు. చాలా మంది మహిళలు ఇలాంటి పరిస్థితుల్లో ఫిజికల్‌ ఈవెంట్స్‌లో పాల్గొనాలంటే భయపడతారు. కానీ అశ్విని ధైర్యం చేసి.. పాల్గొనడమే కాక.. క్వాలిఫై అయ్యింది. ఈసారి ఆమె తప్పకుండా రాత పరీక్ష కూడా క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top