వైరల్​: దుస్తులు చించేసి, మరీ ఘోరంగా..

Justice For Lovi Assumi Actual Facts In Molestation Video - Sakshi

‘‘ఐదుగురు రాక్షసులు ఒక అమ్మాయిని దుస్తులు చించేసి.. శారీరకంగా హింసించారు. ఆపై వీడియోలు తీసి షేర్​ చేశారు. హింసించిన వాళ్లలో ఒక మహిళ కూడా ఉంది’’.. మానవత్వం తలదించుకునే రీతిలో జరిగిన ఈ ఘోరమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియలో దుమారం రేపుతోంది. అత్యాచార అవమానం తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుందని, ఘటనకు కారకులైనవాళ్లను కఠినంగా శిక్షించాలని #justiceforloviassumi హ్యాష్​ట్యాగ్ ట్విటర్​ను కుదిపేస్తోంది. ఇందులో  వాస్తవమెంత ఉందంటే..

జోధ్​పూర్​(రాజస్థాన్​) : ఇరవై ఐదేళ్ల లోవీ అస్సుమీ ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు ఉత్తర భారతాన్ని కుదిపేస్తోంది. నాగాలాండ్​కు చెందిన లోవి.. జోధ్​పూర్​లో ఓ రెస్టారెంట్​లో పని చేస్తోంది. మే 23న తానుంటున్న గదిలో ఆమె ఉరి వేసుకుని సూసైడ్​ చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ లోపు ఇంటర్నెట్​లో ఒక వీడియో రిలీజ్​ అయ్యింది. నలుగురు వ్యక్తులు, ఓ మహిళ కలిసి ఓ అమ్మాయిని దుస్తులు చించేసి శారీరకంగా హింసించిన వీడియో అది. ఆ వీడియోను ఇంటర్నెట్​లో ఉంచారు. కొందరు లోవీ అస్సుమీ ఉరికి వేలాడుతున్న ఫొటోలను, వేధింపుల వీడియోను, అందులోని స్క్రీన్​ షాట్స్​ను షేర్​ చేశారు. ఆ వీడియోలో ఉంది లోవి అస్సుమీ అని, ఆ అవమాన భారం తట్టుకోలేకే ఆమె సూసైడ్ చేసుకుందని ప్రచారం మొదలైంది. దీంతో ఆమెకు న్యాయం జరగాలని సోషల్ మీడియా ఉద్యమిస్తోంది. 

వేర్వేరే ఘటనలు
అయితే నాగాలాండ్​ యువతి సూసైడ్​కి, ఆ వీడియోలకు సంబంధం లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ అడిషినల్ డీజీపీ రాబిన్​ హిబు కార్యాలయం నుంచి ఒక స్టేట్​మెంట్ రిలీజ్​ అయ్యింది.  అవి రెండు వేర్వేరు ఘటనలని, ఈమేరకు జోధ్​పూర్​ డీజీపీతో సంప్రదించి ధృవీకరించినట్లు చెప్పారు. అంతేకాదు వీడియోలను నాగాలాండ్​ యువతి సూసైడ్​కి ముడిపెట్టి వైరల్ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు,  ఈ మేరకు దర్యాప్తు జరపాలని గుజరాత్​, మిజోరాం, రాజస్థాన్​ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ సమాచారంతో కొందరు యూట్యూబర్లు ఈ వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

  

మృగాల్ని శిక్షించాల్సిందే!
అయితే ఘటనలో ఉన్న బాధితురాలు ఎవరైనా సరే.. నిందితులను శిక్షించాల్సిందేనని కొందరు డిమాండ్​ చేస్తున్నారు. ఈ మేరకు అస్సాం పోలీసులు ఫేస్​బుక్​లో ఒక ప్రకటన పోస్ట్​ చేశారు. వీడియోలో ఐదుగురు ఉన్నారని, వాళ్ల ఆచూకీ చెబితే నజరానా అందిస్తామని తెలిపింది. ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలిదు. కానీ, నిందితుల సమాచారం అందిస్తే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం అని అస్సాం పోలీసులు వెల్లడించారు. అయితే వీడియోల్లో ఆ గ్యాంగ్​ ఇద్దరు అమ్మాయిలపై దాష్టీకానికి పాల్పడినట్లు గుర్తించామని కొందరు చెప్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top