"ఈశ్వర్‌ అల్లా" అంటే ఇదేనేమో

Ismail A Resident Of Daspur Is An Idol Maker And Is The Only Choice For People Of His Village For Idol Of Goddess Kali Worshipped During Diwali - Sakshi

పశ్చిమబెంగాల్‌: ఇటీవల కాలంలో మతాల పేర్లుతో కోట్లాడుకోవడాలు చూసి ఉంటాం. అలాగే మాట వరసకు ఏదైనా చిన్న మాట అంటే చాలు మా మతాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఘర్షణకి దిగిపోతారు. అంతేందుకు ఒక ప్రాంతం లేదా గల్లీ మొత్తం ఒక మతంగా నివశిస్తారు. కానీ వాటిన్నింటకి విరుద్ధంగా ఒక ముస్లీం కుటుంబం హిందూ దేవుళ్ల విగ్రహాలను తయారు చేయడమే కాక అన్ని మతాలు ఒకటే భావనను కలిగిస్తున్నారు. 

(చదవండి: సార్‌ నా గర్ల్‌ఫ్రెండ్‌ సాక్స్‌ ఉతక లేదు.... కాబట్టి ఆఫీస్‌కి రాలేను)

అసలు విషయంలోకి వెళ్లితే....పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినీపూర్‌లో దాస్పూర్‌ గ్రామంలోనే ఇస్మాయిల్‌ కుటుంబం నలభై సంవత్సారాలుగా నివాసం ఉంటున్నారు. ‍ ఈ 61 ఏళ్ల ఇస్మాయిల్‌ వృత్తి రీత్యా విగ్రహాలు తయారు చేస్తాడు. అందులోనూ కాళీ విగ్రహాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. అక్కడున్న గ్రామస్తులకు కాళివిగ్రహాలు కావాలంటే ఇస్మాయిల్‌కే ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు ఈ కాళిమాత విగ్రహాలను అతని భార్య , ఐదుగురు కుమార్తెలు కలిసి తయారు చేస్తారు.

పైగా ఇస్మాయిల్‌కి తన తన కూతుళ్లను చదివించడం తనకు భారమే అయినప్పటికీ నా పిల్లలకి "ఈశ్వర్"  "అల్లా" అనే ఇద్దరి దేవుళ్ల ఆశీస్సులు ఉంటాయి కాబట్టి వాళ్లు బాగా చదువుకుని మంచి జీవితాన్ని గడుపుతారని నమ్మకంగా చెబుతాడు.  ఈ మేరకు ఇస్మాయిల్‌​ మాట్లాడుతూ..." “నేను చిన్నప్పటి నుండి ఇదే చేస్తున్నాను. మా ఊరి గ్రామస్తులే కాక ఇతర ప్రాంతాల నుండి సైతం ప్రజలు విగ్రహాల కోసం నా వద్దకే వస్తారు.

నేను పేదవాడిని కానీ అందరి దీవెనలతో నా కుటుంబాన్ని చక్కగా నడపగలుగుతున్నాను. అంతేకాదు నాకు విగ్రహాలు సిద్ధమైనప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది." అని అన్నాడు. ఈ క్రమంలో ఆ గ్రామంలోని బీరేంద్ర రాయ్ అనే స్థానికుడు మాట్లాడుతూ....ఈ గ్రామంలోని ప్రతి హిందువు దేవతా విగ్రహన్ని ఇస్మాయిల్‌ తయారు చేస్తాడు. ఇది మాకు కొత్తేమి కాదు.

అయినా మనమందరం కలిసి పెరిగాం, కలిసి ఉంటున్నాం, ఇదే మన సంస్కృతి" అని అన్నాడు. కానీ ఈ చిన్న గ్రామం నిజంగా మత సామరస్యాంగా ఎలా జీవించాలో ఎలా కొనసాగించాలో ఐక్యతగా జీవిస్తూ చూపించింది. ఈ మేరకు ఇస్మాయిల్‌ ప్రజలు ఐక్యత గురించి తెలుసుకునేలా ప్రపంచంలో ఇలాంటి దస్పూర్‌ గ్రామాలు మరిన్ని ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నాడు.

(చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top