కర్ణాటక: నువ్వు చాలా... ఉన్నావు, నీతో ఒక్కసారి... అంటూ ఓ పోలీసు అధికారి సిగ్గు విడిచి వాట్సాప్ చాటింగ్ చేశాడు. అది కూడా మహిళా రౌడీతో. ఆమె తిరగబడడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. బెంగళూరులో ఈ ఉదంతం వైరల్‌గా మారింది. వివరాలు.. బెంగళూరు కోననకుంటె పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పాపణ్ణపై లేడీ రౌడీషీటర్ యశస్విని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.
పాపణ్ణ తనకు వాట్సాప్‌లో అశ్లీల మెసేజ్‌లు పంపిస్తూ వేధించాడని బుధవారం నగర పోలీస్ కమిషనర్‌కి చాటింగ్, ఆడియో కాల్స్ ఆధారాలతో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన తరువాత కూడా పాపణ్ణ తనకు కాల్ చేసి ఇంటికి వస్తానని, మాట్లాడాలని, కేసు వెనక్కు తీసుకోకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నట్టు బాధితురాలు ఆరోపించింది. కమిషనర్ ఆఫీసు ముందు మీడియాతో మాట్లాడుతూ పాపణ్ణపై తీవ్ర ఆరోపణలు చేసింది. సీఐ మీద విచారణకు ఆదేశించామని, రుజువైతే చర్యలు తీసుకుంటామని స్థానిక ఏసీపీ తెలిపారు.


