డబ్బు సంపాదిస్తామనే ధీమా భారతీయుల్లోనే ఎక్కువ!

Indians Are Confident To Earn Money in Future - Sakshi

‘ఆఫ్టర్‌ వన్‌ ఇయర్‌ ఐ విల్‌ బీ ఎ కింగ్‌’ అనే ఫేమస్‌ డైలాగ్‌ మీకు గుర్తుందా? ఎందుకంటే.. భారతీయుల్లో ఎక్కువ మంది దాదాపు ఈ తరహా సిద్ధాంతాన్నే నమ్ముతున్నారు మరి. ఇంతకీ విషయం ఏమిటంటే.. భవిష్యత్‌లో డబ్బున్నోళ్లం కాగలమన్న ధీమా ప్రపంచంలో భారతీయుల్లోనే ఎక్కువట. ఎప్పటికైనా డబ్బు సంపాదించుకోగలమనే విశ్వాసాన్ని ఎక్కువ మంది భారతీయులు వ్యక్తం చేసినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

తాము ధనవంతులం అయ్యే అవకాశం అత్యంత ఎక్కువగా లేదా ఎక్కువగానే ఉందని పట్టణ ప్రాంతాలకు చెందిన భారతీయుల్లో 71 శాతం మంది తమ ఆన్‌లైన్‌ అధ్యయనంలో పేర్కొన్నట్లు స్టాటిస్టా గ్లోబల్‌ కన్జూమర్‌ సర్వే సంస్థ వెల్లడించింది. అలాగే సగటుకన్నా ఎక్కువ ధనాన్ని కూడబెట్టే అవకాశం తమకు ఉన్నట్లు 93 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డట్లు తెలిపింది.

ఈ సర్వే ఫలితాల ప్రకారం.. వ్యక్తిగత ఆర్థిక విజయాలు సాధించే విషయంలో ఇతర దేశాల ప్రజలు ఏమంత ఆశాజనకంగా లేరు. మెక్సికో, అమెరికా, జర్మనీకి చెందిన ప్రజల్లో కేవలం 24–25 శాతం మంది మాత్రమే ధనవంతులు కాగలగడంపై కొంత స్పష్టతతో ఉన్నారు. అలాగే సుమారు 50 శాతం మంది మాత్రం తాము ధనవంతులం కాగలమని విశ్వసించేందుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. యూకే, ఫ్రాన్స్‌లలో 40 శాతంకన్నా తక్కువ మంది ఈ ప్రశ్నకు సానుకూలంగా బదులివ్వగా వ్యక్తిగత ఆర్థిక విజయాలు సాధించడం తమకు అత్యంత కష్టమని 50%కన్నా ఎక్కువ మంది ఈ దేశాల ప్రజలు అభిప్రాయపడ్డారు.  
సర్వేలో పాల్గొన్న వివిధ దేశాల ప్రజల అభిప్రాయాలు (శాతాల్లో)
చదవండి: పదేళ్ల క్రితం చేతిలో రూ.6,300.. ఇప్పుడేమో కోట్లు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top