భారతీయ విద్యార్థికి రూ.1.3కోట్ల స్కాలర్‌‌షిప్‌

Indian Agriculture Student Wins Scholarship To PhD In Australia - Sakshi

న్యూఢిల్లీ: లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ(ఎల్‌పీయూ)కి చెందిన ఓ విద్యార్థికి ప్లాంట్స్‌ సైన్స్‌ అంశంలో ఆస్ట్రేలియాలో పీహెచ్‌డీ చేసేందుకు గాను 1.3 కోట్ల రూపాయలు ఫుల్‌ పెయిడ్‌ స్కాలర్‌షిప్‌ లభించింది. ఈ రంగంలో ఇంతవరకు లభించిన అత్యధిక స్కాలర్‌షిప్‌ ఇదే కావడం విశేషం. వివరాలు.. సుమంత్‌ బిందాల్‌ అనే యువకుడు ఎల్‌పీయూలో వ్యవసాయ రంగంలో ప్రత్యేకంగా జన్యుశాస్త్రం, మొక్కల పెంపకంలో మాస్టర్స్‌ ఆఫ్‌ సైన్స్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో బిందాల్‌కు ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ(ఏఎన్‌యూ)లో పీహెచ్‌డీ చేయడానికి స్కాలర్‌షిప్‌ లభించింది. దీనితో బిందాల్‌ టమోటా మొక్కలను నాశనం చేసే ఫ్యూసేరియం అనే ఒక రకమైన ఫంగస్‌ గురించి పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఈ ఫంగస్‌ వల్ల ఏటా భారతదేశంలో టమోటా రైతులు 45శాతం దిగుబడిని కోల్పోతున్నారు. (ఆస్ట్రేలియాలో సింబా)

ఈ నేపథ్యంలో బిందాల్‌ మాట్లాడుతూ.. ‘ఈ స్కాలర్‌షిప్‌ అందుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఏఎన్‌యూ ప్రపంచంలోని ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఒకటి. ఇక్కడ పీహెచ్‌డీ చేయాలనేది నా జీవిత ఆశయం. ఇందుకు సహకరించిన నా అధ్యాపకులకు, సలహాదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top