మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు.. ఢిల్లీలో కలవరం.. కొత్త మార్గదర్శకాలు జారీ

India Repors 1150 Covid Cases Delhi Reports 461 AAP Govt Issues New Guidelines - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1150 కొత్త కేసులు నమోదుకాగా.. ఒక్క ఢిల్లీలోనే 461 మందికి వైరస్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. వైరస్‌​ బాధితుల్లో ఇద్దరు చనిపోయారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.95 నుంచి 5.33 శాతానికి పెరిగింది. 

తాజా కేసులతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 4,30,42,097 చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 11,558 కు చేరిందని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 0.03 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని పేర్కొంది.

ఇక కేసులు భారీగా బయటపడిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్కూల్స్‌లో కరోనా నిబంధనలు పాటించాలంటూ కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. అలాగే ఢిల్లీ వాసులకు ఉచితంగా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని ఆప్‌ సర్కార్‌ నిర్ణయించింది.

రాజధానిలో అగ్ని ప్రమాదం
ఢిల్లీలోని గ్రీన్‌పార్క్‌ వద్ద ఉపహార్‌ థియేటర్‌లో అగ్నిప్రమాదం తలెత్తింది. దీంతో మంటలు చెలరేగాయి. 9 ఫైర్‌ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపుచేశాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదుని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. కాగా, 1997, జూన్‌ 13న ఇదే థియేటర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచి ఈ సినిమా హాల్‌ వినియోగంలో లేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top