కోవిడ్‌-19 : వ్యాక్సిన్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన | Harsh Vardhan Says Emergency Use Of Vaccine Only After Trial Data | Sakshi
Sakshi News home page

కోవిడ్‌-19 : వ్యాక్సిన్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన

Oct 11 2020 8:14 PM | Updated on Oct 11 2020 8:14 PM

Harsh Vardhan Says Emergency Use Of Vaccine Only After Trial Data - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వాడకానికి వ్యాక్సిన్‌ భద్రత, సామర్థ్యం గురించిన డేటా అవసరమని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర‍్ధన్‌ పేర్కొన్నారు. సండే సంవాద్‌లో తన ఫాలోయర్లతో ప్రతి వారం జరిపే సంప్రదింపుల్లో భాగంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్‌ ప్రయోగ ఫలితాల ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. భారత్‌లో ప్రస్తుతం పలు వ్యాక్సిన్‌లు తొలి, మలి, మూడవ దశ పరీక్షలు జరిపే దశలో ఉన్నాయని, ఈ పరీక్షల ఫలితాలు వ్యాక్సిన్‌ వ్యూహాన్ని నిర్ధారించడంలో ఉపకరిస్తాయని ఆయన పేర్కొన్నారు. వైరస్‌ సోకే ముప్పున్న వ్యక్తులతో పాటు వైరస్‌ కారణంగా మరణించే అవకాశాలు అధికంగా ఉన్న గ్రూపులకు ముందుగా వ్యాక్సిన్ అందిస్తామని మంత్రి తెలిపారు. చదవండి : 70 శాతం మందికి వ్యాక్సిన్‌ అందేది అప్పుడే!

వ్యాక్సిన్‌ల అందుబాటు ఆధారంగా పలు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌లను సమీకరించే సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. సీఎస్‌ఐఆర్‌-ఐజీఐబీ అభివృద్ధి చేసిన ఫెలుదా పేపర్‌ స్ర్టిప్‌ పరీక్షను మరికొద్ది వారాల్లో దేశవ్యాప్తంగా ప్రవేశపెడతామని చెప్పారు. కోవిడ్‌-19ను గుర్తించడంలో దీనికి 98 శాతం కచ్చితత్వం ఉన్నట్టు ప్రయోగ పరీక్షల్లో వెల్లడైందని తెలిపారు. ఇక రానున్న పండగ సీజన్‌లో ప్రజలు పెద్దసంఖ్యలో గుమికూడరాదని, ఇది వైరస్‌ వ్యాప్తిని పెంచుతుందని మంత్రి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement