గుజరాత్‌లో సన్యాసిగా సంపన్నుడి కూతురు

Gujarat Diamond Trader 9 Year Old Daughter Become Monk - Sakshi

చిన్నవయసులో భౌతిక సుఖాలను త్యజించి సన్యాసం స్వీకరించింది తొమ్మిదేళ్ల చిన్నారి. ఈ ఘటన గుజరాత్‌లోని వెసు అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. పైగా ఆ చిన్నారి సంపన్న వజ్రాల వ్యాపారి కూతురు. వివరాల్లోకెళ్తే వజ్రాల వ్యాపారి ధనేష్‌ అతడి భార్య సంఘ్వీలకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె దేవాన్షి సన్యాసిగా దీక్ష తీసుకుంటున్నట్లు కుటంబ సభ్యులు తెలిపారు. ఆ చిన్నారి తండ్రి సూరత్‌లో దాదాపు మూడు దశాబ్దాల నాటి డైమండ్‌ పాలిషింగ్‌ ఎగుమతి సంస్థ సంఘ్వీ అండ్‌ సన్స్‌ యజమాని.

ప్రస్తుతం ఆమె అన్ని విలాసాలను త్యజించి సన్యాసి దీక్ష తీసుకుంటుంది. చిన్న వయసు నుంచి ఆమె ఆధ్యాత్మిక జీవితం వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. అంతేగాదు అధికారికంగా ఈ సన్యాసి జీవితాన్ని స్వీకరించడానికి ముందు ఇతర సన్యాసులతో సుమారు రూ.700 కి.మీ దూరం నడించిందని, వారిలా జీవనం సాగించిందని కుంటుంబికులు చెబుతున్నారు. ఆమెకు ఐదు భాషలు తెలుసని, పైగా ఇతర ప్రత్యేక నైపుణ్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ సన్యాసి దీక్ష వేడుక గత శనివారం ప్రారంభమైంది. అంతేగాదు మంగళవారం, దేవాన్షి 'దీక్ష' తీసుకునే ఒక రోజు ముందు, నగరంలో కోలాహలంగా పెద్ద ఎత్తున మతపరమైన ఊరేగింపు జరిగింది.

(చదవండి: విచిత్రమైన ప్రేమ కథ: చ​నిపోయి తమ ప్రేమను గెలిపించుకున్న జంట!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top