
తమిళనాడు: మురుకులు తింటూ ప్రమాదవశాత్తు కందిరీగను మింగిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. దిండుగల్ జిల్లాకు చెందిన కార్తీక్ తామరపాక్కంలోని శక్తి నగర్‌లో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, కుగశ్రీతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాలిక శనివారం సాయంత్రం ఇంటి వద్ద మురుకులు తింటూ కందీరీగను మింగినట్టు తెలుస్తోంది.
అయితే మురుకులు గొంతులో చిక్కుకున్నట్టు భావించిన తల్లిదండ్రులు చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ బాలికకు ఎక్స్‌రే తీయగా, గొంతులో కందిరీగ ఉన్నట్టు గుర్తించి షాక్‌కు గురయ్యారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందింది. అనంతరం బాలిక మృతదేహానికి పంచనామా నిర్వహించి గొంతులో చిక్కుకున్న కందిరీగను బయటకు తీశారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.