మలబార్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

సాక్షి, కేరళ: తిరువనంతపురం జిల్లాలో మలబార్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మలబార్ ఎక్స్‌ప్రెస్ లగేజ్ వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. ఆదివారం ఉదయం వర్కాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలను ప్రయాణికులు గుర్తించి గార్డుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రైలును నిలుపుదల చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి