బెంగాల్‌ మంత్రి నివాసాల్లో ఈడీ సోదాలు

ED raids at TMC minister house in connection with ration distribution case - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అటవీ శాఖ మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జ్యోతిప్రియో మల్లిక్‌ నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు గురువారం ఉదయం సోదాలు ప్రారంభించారు. బెంగాల్‌లో రేషన్‌ సరుకుల పంపిణీలో కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు కోల్‌కతాలో మంత్రికి చెందిన రెండు నివాసాల్లో సోదాలు ప్రారంభించారు.

ఆయన మాజీ వ్యక్తిగత సహాయకుడి ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. జ్యోతిప్రియో మల్లిక్‌ గతంలో ఆహార శాఖ మంత్రి పనిచేశారు. ఆ సమయంలోనే రేషన్‌ పంపిణీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో మంత్రితో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని ఈడీ అరెస్టు చేసింది. మంత్రి బ్యాంకు ఖాతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, అనుమానాస్పద లావాదేవీలపై ఆయనను ప్రశి్నస్తున్నామని అధికారులు వెల్లడించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top