
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భూకంపంతో వణికింది. ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.7గా నమోదైంది. కాగా, నిన్న(గురువారం) కూడా భూకంపంతో వణికిన హస్తిన.. రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రత నమోదయ్యింది. హరియాణాలోని ఝాజ్జర్ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదైందని జాతీయ భూకంపశాస్త్ర కేంద్రం ప్రకటించింది.
ఢిల్లీ–ఎన్‌సీఆర్, హరియాణాతోపాటు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోనూ భూమి కంపించింది. భూప్రకంపనలతో హస్తినవాసులు వణికిపోయారు. గురువారం ఉదయం 9 గంటల నాలుగు నిమిషాలకు కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ఢిల్లీలో కొందరు స్థానికులు ప్రాణభయంతో భవనాలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.